జగనన్న సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు! | - | Sakshi
Sakshi News home page

జగనన్న సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు!

Apr 2 2026 8:58 AM | Updated on Apr 2 2026 8:58 AM

● నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి

రాపూరు: కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అక్రమాలకు ప్రజలు విసిగిపోయారని, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. వైఎస్సార్‌ సీపీ అధినాయకులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాపూరు మండలం తానంచెర్ల గ్రామంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానులన్నారని, అమరావతికి వ్యతిరేకంగా ఆయన ఎప్పుడు మాట్లాడలేదన్నారు. పార్లమెంటు సమావేశంలో ఎంపీ మిథున్‌రెడ్డి బుధవారం మాట్లాడుతూ ఢిల్లీలో చదరపు అడుగు రూ.4 వేలు ఇస్తుంటే అమరావతిలో రూ.12 వేలు ఇవ్వడం ఎంత వరకు సమంజసంమని ప్రశ్నించారని, ఇది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3 లక్షల కోట్లు అప్పు తీసుకువస్తే రెండు సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం రూ.3.60 లక్షల కోట్లు అప్ప చేశారని విమర్శించారు. గ్రామాల్లో రోడ్లు వేయలేదని అంటున్నారని, గ్రామాల్లో తిరిగితే ఏ ప్రభుత్వం అభివృద్ధి చేసిందో తెలుస్తుందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన అప్పునకు లెక్కలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని, మీరు తీసుకువచ్చిన అప్పునకు లెక్క చెప్పగలరా? అని అన్నారు. ఈ విషయంపై తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, మీరు సిద్ధమేనా? అని ఆయన సవాలు విసిరారు. ఆయన వెంట ఎస్‌ఈసీ సభ్యులు పాపకన్ను మధుసూదన్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి దందోలు లక్ష్మీనారాయణరెడ్డి, మండల కన్వీనర్‌ బొడ్డు మధుసూదన్‌రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ డాక్టర్‌ వింగ్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఖాదర్‌బాషా, వైఎస్సార్‌ సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి వంకివోలు కోటేశ్వరరెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ వలంటీర్‌ విభాగం అధ్యక్షుడు దుగ్గిరెడ్డి నరసింహరెడ్డి, పార్టీ రైతు సంఘం మండల అధ్యక్షులు రమణారెడ్డి, సంక్రాంతిపల్లి గ్రామ అధ్యక్షులు రామకష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు సంజీవరెడ్డి, మహేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement