ఆ ఐదేళ్లు..అభివృద్ధికి ప్రతీక! | - | Sakshi
Sakshi News home page

ఆ ఐదేళ్లు..అభివృద్ధికి ప్రతీక!

Mar 23 2026 7:04 AM | Updated on Mar 23 2026 7:04 AM

● జగనన్న పాలనలో రూ.978 కోట్లతో అభివృద్ధి ● సర్పంచ్‌ల అభినందన సభలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

అట్టహాసంగా సర్పంచ్‌ల

అభినందన సభ

చంద్రగిరి: ‘నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించాం.. గత ఐదేళ్ల జగనన్న పాలనలో రెండేళ్ల పాటు కరోనాతో కాలం గడిచిపోయినా కేవలం మూడేళ్లలో భవిష్యత్తు తరాలు చెప్పుకునేలా పల్లెల్లో అభివృద్ధి పనులు పూర్తి చేశాం. రూ.978 కోట్లు ఖర్చు చేసి 5,096 అభివృద్ధి పనులను పూర్తి చేశాం. గెలుపోటములు సహజం.. చేసిన అభివృద్ధి మాత్రం కళ్ల ముందే కనిపిస్తుంది.. ఇప్పటి సర్పంచ్‌ల పేర్లు తరతరాలు గుర్తుండిపోతాయి.. సర్పంచ్‌ల సహకారం మరువలేనిది.. సర్పంచ్‌గా మంచి పేరు తెచ్చుకున్న వారంతా పదవి ముగియగానే జగనన్నకు సైనికులుగా మారి క్షేత్ర స్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలి.. ఐదేళ్ల ప్రజాసేవకు ఆత్మీయ సత్కారం చేస్తున్నాం.’ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ మాజీ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పేర్కొన్నారు. చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీ ముక్కోటి సమీపంలోని నారాయణీ గార్డెన్స్‌ కల్యాణ మండపంలో సర్పంచ్‌ల అభినందన సభను నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల నుంచి సుమారు 90 మంది సర్పంచ్‌లు ఆ సభకు హాజరై చెవిరెడ్డి కుటుంబం నుంచి ఆత్మీయ సత్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ తన కుటుంబంలో ఒక భాగమైన సర్పంచ్‌లను అభినందించడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి పంచాయతీలో రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లు వరకు ఖర్చు చేశామన్నారు. చంద్రగిరి నియోజకవర్గ చరిత్రలో ఇంతలా అభివృద్ధి పరుగులు పెట్టించిన దాఖలాలు లేవన్నారు.

ఎన్నికల్లో ఏదో జరిగింది?

గత ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లిన ఒక మనిషి చేతికి సిరా చుక్క పెట్టుకున్నప్పటి నుంచి ఎమ్మెల్యే, ఎంపీలకు ఓటు వేసి బయటకు రావాలంటే 6 నుంచి 7 నిమిషాల సమయం పడుతుందని, అయితే పోలింగ్‌ జరిగిన రోజు ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు ఓటింగ్‌ జరిగినా రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారు జామున 2 గంటల వరకు ఒక నిమిషానికి మూడు ఓట్లు పడిననట్టుగా ఎన్నికల కమిషన్‌ చెప్పిన లెక్కల ప్రకారం నిర్ధారణ అవుతోందన్న చర్చ టీవీ డిబేట్లలో జరుగుతోందని చెవిరెడ్డి అన్నారు. కుట్రలు, కుతంత్రాలు, మాయా జాలంతో గెలిచిన వారు ప్రజల ముందు ఎప్పటికై నా దోషులుగా నిలబడక తప్పదని హెచ్చరించారు.

అభివృద్ధికి ప్రతీకలుగా నిలిచారు

చంద్రగిరి నియోజకవర్గంలోని సర్పంచ్‌లు అభివృద్ధికి ప్రతీకలుగా నిలిచారని వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి స్పష్టం చేశారు. సిమెంటు రోడ్లు, రచ్చబండ లు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రా లు, కల్యాణ వేదికలు, కర్మక్రియల భవనాలు, యోగ, ధ్యాన మందిరాలు, మహిళా భవనాలు ఇలా చెప్పలేనంతగా అభివృద్ధి చేసి చూపడం చంద్రగిరి చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. చివర గా రాష్ట్ర వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చెవిరెడ్డి హర్షిత్‌ మాట్లాడారు. గత ప్రభు త్వంలో చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక పోయామని, వచ్చే స్థానిక ఎన్నికల్లో ఇప్పుడున్న సర్పంచ్‌లు తిరిగి పోటీ చేస్తే కచ్చితంగా గెలుస్తారన్న నమ్మకం తనకుందన్నారు. ఆరు మండలాల పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, సర్పంచ్‌తో పాటు వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

నేటి సర్పంచ్‌లే.. రేపటి జగనన్న సైనికులు

ఇప్పుడు సర్పంచ్‌లుగా ఉన్న వారంతా ఏప్రిల్‌ 2వ తేదీ తరువాత పదవీ కాలం ముగిసిన తర్వాత జగనన్నకు సైనికులుగా మారాలని పిలుపునిచ్చారు. జగనన్నను అధికారంలోకి తీసుకు వచ్చేంత వరకు పోరాడాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement