క్రికెట్‌ కప్‌ పోలీస్‌ జట్టు కై వసం | - | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ కప్‌ పోలీస్‌ జట్టు కై వసం

Mar 23 2026 7:04 AM | Updated on Mar 23 2026 7:04 AM

రేణిగుంట: సీఆర్‌ఎస్‌ క్రీడా మైదానంలో ఆదివారం రేణిగుంట డివిజన్‌ పోలీస్‌, రేణిగుంట జర్నలిస్టుల జట్ల మధ్య క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. పోలీస్‌ జట్టుకు అర్బన్‌ సీఐ జయచంద్ర కెప్టెన్‌గా వ్యవహరించగా, జర్నలిస్ట్‌ జట్టుకు మురళి నాయకత్వం వహించారు. పోలీస్‌, ప్రెస్‌ క్రికెట్‌ పోటీలకు ముఖ్య అతిథులుగా రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, పుత్తూరు డీఎస్పీ రవికుమార్‌ పాల్గొని ఇరుజట్ల ఆటగాళ్లను పరిచయం చేసుకుని మ్యాచ్‌ ప్రారంభించారు. డీఎస్పీ శ్రీనివాసరావు టాస్‌ వేయడంతో రేణిగుంట జర్నలిస్టు టీం టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. జర్నలిస్ట్‌ టీం నిర్ణీత 15 ఓవర్లకు 110 పరుగులు చేసింది. 111 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పోలీస్‌ టీం 14.1 ఓవర్లో 111 పరుగులు చేసి విజయభేరి మోగించారు. సురేష్‌ ఆల్‌ రౌండర్‌గా నిలిచి పోలీస్‌ టీమ్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించడంతో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు కై వసం చేసుకున్నారు. బెస్ట్‌ బౌలర్‌ జర్నలిస్టు టీమ్‌ స్పీడ్‌ స్టార్‌ నిషార్‌ అహ్మద్‌, బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా బిన్నీ కై వసం చేసుకున్నారు. పోటీల్లో గెలుపొందిన పోలీస్‌ టీం కెప్టెన్‌ జయ చంద్ర విన్నింగ్‌ ట్రోఫీని, జర్నలిస్ట్‌ టీం కెప్టెన్‌ మురళి రన్నర్స్‌ ట్రోఫీని డీఎస్పీ శ్రీనివాసరావు, పుత్తూరు డీఎస్పీ రవికుమార్‌ చేతుల మీదుగా అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement