రాష్ట్రంలో ప్రజాసంక్షేమం, అభివృద్ధి శూన్యం చంద్రబాబు తెచ్చే రూ. లక్షల కోట్ల అప్పులు ఏమవుతున్నాయో ఆ దేవుడికే ఎరుక వైఎస్సార్‌పీపీ గెలుపునకు బూత్‌కమిటీలను పటిష్టం చేసుకుందాం పార్టీ బూత్‌కమిటీ రాష్ట్ర స్థాయి సమావేశంలో భూమన, ఆర్కే రోజా, సుధాకర్‌రెడ్డి
రెండేళ్లలోనే
వైఎస్సార్ సీపీ బూత్‌కమిటీ రాష్ట స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న భూమన కరుణాకరరెడ్డి, ఆర్కే రోజా
‘బాబు సర్కారు గద్దెనెక్కి రెండేళ్లు..
అప్పటి నుంచి ఆడంబరపు మాటలు..
అభివృద్ధి పేరిట ఆకాశయానాలు..
అప్పుల కుప్పలు.. వెరసి పడకేసిన
అభివృద్ధి.. అమలుకు నోచుకోని హామీలు.. అందని సంక్షేమం.. ఫలితంగా బాబు పాలనపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది.’ అని వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు.
తిరుపతి మంగళం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి బూత్ కమిటీల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
జాబితాలో డబ్లింగ్ ఓట్లను తొలగించాలి
చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ విజయానంద రెడ్డి మాట్లాడుతూ బూత్ లెవల్, ఎలక్షన్ ఏజెంట్లకు ఇప్పటి నుంచి శిక్షణ ఇవ్వడం ద్వారా భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. చిత్తూరు నియోజకవర్గంలో బెంగళూరు, చైన్నెలో స్థిరపడివారి ఓట్లు 15వేల నుంచి 20 వేలు ఉన్నాయన్నారు. పొరుగు రాష్ట్రాల్లో మనకంటే ముందుగా ఎన్నికలు జరగడంతో అక్కడ ఓట్లు వేసి, మళ్లీ ఇక్కడ ఓట్లు వేస్తున్నారన్నారు. చిత్తూరు నియోజకవర్గంలో బెంగళూరు నుంచి వచ్చి పంచాయతీకి రూ.కోటి వరకు ఖర్చు చేసినవారు ఉన్నారన్నారు. ఇలాంటి డబుల్ ఓటింగ్ వేసే వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలన్నారు.
భూమన కరుణాకరరెడ్డి మా ట్లాడుతూ ప్రజలకు అబద్ధపు హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని, ప్రజలకు ఇచ్చి న హామీలను పూర్తిగా విస్మరించిందన్నారు. ఎంతసేపు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం, దుర్భాషలాడడం తప్ప మరొకటి లేదన్నారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. క్షేత్ర స్థాయిలో బూత్ కమిటీలు కీలకంగా వ్యవహరించి, అధికార పార్టీ నాయకులు దొంగ ఓట్లను చేర్చకుండా చూడాలన్నారు. పార్టీ నేతలమైన తాము ఎంత కష్టపడినా బూత్‌కమిటీలు, బీఎల్వోలు సక్రమంగా పనిచేస్తేనే వైఎస్సార్ సీపీని తిరిగి అధికారంలోకి తీసుకురాగలమన్నారు. ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయన్నారు. ఎలక్షన్ కమిషన్ పెట్టే ప్రతి సమావేశానికి బూత్ కమిటీలు, బీఎల్‌వోలు హాజరుకావాలన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో మనపార్టీ ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు.
మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రానికి గ్రహణం పట్టుకుందన్నారు. ప్రజాసంక్షేమం, అభివృద్ధి పడకేసి, రాష్ట్ర ప్రజలంతా నానా అవస్థలు పడుతున్నారని చెప్పారు. చంద్రబాబు తెచ్చే రూ.లక్షల కోట్ల అప్పులు దేనికి ఖర్చుపెడుతున్నారో ఆ దేవుడికే ఎరుకన్నారు. ఏదైనా మాట్లాడితే అమరావతి అభివృద్ధి తప్ప చంద్రబాబు నోట మరొకటి రాదన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఎలా అధికారంలోకి వచ్చారో అందరికీ తెలుసునన్నారు. రాబోయే ఎన్నికల్లో అలా కాకుండా పట్టిష్టంగా బూత్‌కమిటీలు పని చేసి జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం బూత్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ బూత్‌కమిటీలు సమర్థవంతంగా పనిచేసినప్పుడే వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తీసుకురాగలమన్నారు. ఆ బాధ్యత మనందిరిపై ఉందన్న విషయాన్ని బూత్‌కమిటీలన్నీ గుర్తు పెట్టుకుని పనిచేయాలని కోరారు. వైఎస్సార్‌సీపీ గెలుపునకు బూత్ కమిటీలే కీలకమన్నారు. జగనన్న మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుందామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్, నియోజకవర్గ సమన్వయకర్తలు భూమన అభినయ్‌రెడ్డి, విజయానందరెడ్డి, నూకతోటి రాజేష్, మాజీ మేయర్ శిరీష, వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, బూత్‌కమిటీ నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్రానికి ‘చంద్ర’ గ్రహణం
దొంగ
ఓట్లతో జాగ్రత్త


