కొలువొక స్వప్నం.. పండుగ పూట ప్రగల్భం | - | Sakshi
Sakshi News home page

కొలువొక స్వప్నం.. పండుగ పూట ప్రగల్భం

Mar 21 2026 4:48 AM | Updated on Mar 21 2026 4:48 AM

సీఎం సారూ.. 6 లక్షల ఉద్యోగాలు ఎవరికిచ్చారూ? జాబ్‌ క్యాలెండర్‌ అంటూ 10 వేలు పోస్టులు ప్రకటించడం హాస్యాస్పదం మాటతప్పి..మభ్యపెడితే తిరుగుబాటు తప్పదు బాబు సర్కార్‌కు విద్యార్థి సంఘాలు,నిరుద్యోగుల హెచ్చరిక

ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు.. గద్దెనెక్కి రెండేళ్లు.. అయినా అమలుకు నోచుకోని హామీలు.. జాబ్‌ క్యాలెండర్‌ పేరిట ఉగాది వేళ బాబు ప్రగల్భం.. తీరా చూస్తే తూతూ మంత్రంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ తేదీలు.. అరకొర ఉద్యోగాల భర్తీకి జారీ చేయనున్న నోటిఫికేషన్లకు లక్షలాది మంది నిరుద్యోగులు పోటీ.. వెరసి కొలువొక స్వప్నంగా మిగిలింది.. ఫలితం నిరుద్యోగ యువత ఆగ్రహం వెలిబుచ్చుతోంది.

తిరుపతి సిటీ: ఉగాది రోజున ప్రభుత్వం జాబ్‌ క్యాలెండ్‌ విడుదల చేస్తోందని ప్రకటించడంతో ఎంతో మంది నిరుద్యోగులు ఆత్రుతగా ఎదురు చూశారు. కానీ చంద్రబాబు సర్కార్‌ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. 10 వేల ఉద్యోగాలు ఈ ఏడాది పొడువునా భర్తీ చేస్తామంటూ చావు కబురు చల్లగా చెప్పడంతో నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో పదివేల పోస్టులు భర్తీ చేస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసే ప్రకటనలు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏటా 2 లక్షల మందికి దాటుతున్న వయోపరిమితి

చంద్రబాబు సర్కార్‌ పాలన రెండేళ్లు గడిచింది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్‌ విడుదల కాలేదు. దీంతో వయోపరిమితి మించిపోవడంతో తిరుపతి జిల్లాలో ఏటా సుమారు 2 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత కోల్పోతున్నారు. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల కోసం ఎదురు చూసిన ఎంతో మంది నిరుద్యోగులు బెంగళూరు, చైన్నె, హైదరాబాద్‌ వంటి నగరాలకు వలస వెళ్లి చిన్న చిన్న కంపెనీల్లో చిరుద్యోగంతో జీవనం సాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement