పెంచలకోన ఆలయానికి రూ.20.78 లక్షల ఆదాయం | - | Sakshi
Sakshi News home page

పెంచలకోన ఆలయానికి రూ.20.78 లక్షల ఆదాయం

Mar 21 2026 4:48 AM | Updated on Mar 21 2026 4:48 AM

● క్లీనర్‌ మృతి

రాపూరు: మండలంలోని పెంచలకోనలో ఏప్రిల్‌ మాసంలో జరిగే లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తాత్కాలిక దుకాణాల ఏర్పాటుకు శుక్రవారం జరిగిన వేలం పాటల్లో దేవస్థానానికి రూ.20.78 లక్షల ఆదాయం వచ్చిందని ఏసీ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్‌ 26 నుంచి జూన్‌ 7వ తేదీ వరకు 49 తాత్కాలిక దుకాణాల ఏర్పాటుకు వేలం పాటలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ వేలం పాటల్లో రూ.20.78 లక్షల రాబడి వచ్చిందన్నారు.

కాలువలో లారీ బోల్తా

ఏర్పేడు: వెంకటగిరి మార్గంలోని నచ్చనేరి సమీపంలో ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎదురుగా శుక్రవారం సాయంత్రం ధాన్యం లారీ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో లారీ క్లీనర్‌ దుర్మరణం పాలయ్యాడు. ఏర్పేడు సీఐ శ్రీకాంత్‌రెడ్డి కథనం మేరకు.. వరదయ్యపాళెంలోని కుమారస్వామికి చెందిన లారీ శుక్రవారం ఏర్పేడు మండలం నాగంపల్లికి చేరుకుని, మహానందరెడ్డి అనే రైతు పొలంలో ఉన్న ధాన్యం 300 బస్తాలు లోడ్‌ చేసుకుని బయలుదేరింది. ఏర్పేడు– వెంకటగిరి రహదారిలోకి వస్తున్న క్రమంలో డేవిడ్‌ లూయిస్‌ లెప్రసీ ఆస్పత్రి సమీపంలో ఉన్న ఎస్‌ఎస్‌ కెనాల్‌లో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ గోపికి స్వల్ప గాయాలు కాగా, క్లీనర్‌ రూపేష్‌ చౌదరి(32) క్యాబిన్‌లో ఇరుక్కుపోయి దుర్మరణం చెందాడు. బిహార్‌ రాష్ట్రం ఈస్ట్‌ చంపారన్‌కు చెందిన రూపేష్‌ చౌదరి రెండేళ్లుగా కుమారస్వామి వద్ద లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న ఏర్పేడు పో లీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్యాబిన్‌లో ఇరుక్కున్న క్లీనర్‌ మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

టీటీడీకి రూ.10 లక్షల విరాళం

తిరుమల: హైదరాబాద్‌కు చెందిన ముత్తా గౌతమ్‌ దంపతులు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు విరాళం డీడీని అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement