ఆర్టీసీ షాపుల టెండర్‌కు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ షాపుల టెండర్‌కు దరఖాస్తుల ఆహ్వానం

Mar 21 2026 5:27 AM | Updated on Mar 21 2026 5:27 AM

– IIలో

కాలువలో లారీ బోల్తా
ఏర్పేడు మండలం నాగంపల్లి సమీపంలోని కాలువలో ధాన్యం లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో క్లీనర్‌ మృతి చెందాడు.

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: జిల్లాలోని ఆర్టీసీ డిపోల పరిధిలో ఉన్న బస్‌స్టాండ్లలో షాపుల నిర్వహణకు టెండర్‌ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీపీటీఓ ఎం.జగదీష్‌ తెలిపారు. టెండర్‌ దరఖాస్తులు ఆయా డిపో మేనేజర్‌ కార్యాలయాల పనివేళల్లో పొందవచ్చన్నారు. కాగా ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు గడువు నిర్ణయించినట్లు తెలిపారు. అదే రోజు పూర్తి చేసిన దరఖాస్తులను మధ్యాహ్నం 2 గంటల లోపు తిరుపతి జిల్లా ప్రజా రవాణ శాఖ వారి కార్యాలయంలోని టెండర్‌ బాక్సులో దాఖలు చేయాలన్నారు, అదే రోజు మధ్యా హ్నం 3 గంటలకు టెండరు దారుల సమక్షంలో టెండర్లు తెరువనున్నట్లు తెలిపారు. స్టాళ్లు, షాపులు ఖాళీ స్థలాల సంఖ్య109 చేపట్టనున్న టెండర్‌ ప్రక్రియలో ఆసక్తిగలవారు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. తిరుపతి డిపోలోని శ్రీహరి, అన్నమయ్య, శ్రీనివాస, ఏడుకొండలు, రేణిగుంట బస్‌స్టాండ్‌, రంగంపేట కమర్షియల్‌ కాంప్లెక్స్‌, చంద్రగిరి పల్లెవెలుగు బస్టాండ్‌, పాకాల, నేండ్రగుంట, భాకరాపేట, పుత్తూరు, శ్రీకాళహస్తి, పిచ్చాటూరు, సత్యవేడు, కేవీబీ పురం, ఏర్పేడు, నాగలాపురం, వరదయ్యపాళెం, వాకాడు, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి, బాలాయపల్లి బస్టాండ్లలోని షాపులకు టెండర్ల ప్రక్రియ ఉంటుందన్నారు. వివరాలకు ఆయా పరిధిలోని ఆర్టీసీ డిపో అధికారులను సంప్రదించాలని కోరారు.

ఆదిలక్ష్మీదేవికి వజ్రాల మంగళసూత్రం

రాపూరు: మండలంలోని పెంచలకోనలో ఉన్న ఆదిలక్ష్మీదేవికి హైదరాబాద్‌కు చెందిన వసంతపు శ్రీనివాస్‌, మాధవి దంపతులు రూ.11 లక్షల విలువైన ఆభరణాలు శుక్రవారం బహూకరించినట్లు ఏసీ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. అమ్మవారికి వజ్రాలతో కూడిన బంగారు మంగళసూత్రం, వెండికాలి పట్టీలు, వెండి మెట్లు అందించినట్లు ఆయన తెలిపారు. దాతలకు మూడు ఆలయాల్లో ప్రత్యేకపూజలు, శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందించినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement