అధికారుల అండ | - | Sakshi
Sakshi News home page

అధికారుల అండ

Mar 15 2026 4:55 AM | Updated on Mar 15 2026 4:55 AM

అధికార పార్టీ నేతలకు ఆదాయవనరుగా స్వర్ణముఖి నది

నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో తవ్వకాలు

కన్నెత్తి చూడని అధికార యంత్రాంగం

అక్రమ రవాణాను అడ్డుకున్న

వైఎస్సార్‌సీపీ నేతలు, రైతులు

ఇసుకింకరులకు

స్వర్ణముఖి నదిలో ఇసుక తవ్వుతున్న

హిటాచీ

పెళ్లకూరు: స్వర్ణముఖి నదిని రేయింబవళ్లు యంత్రాలతో కుళ్లబొడుస్తూ ఇసుక దోపిడీ చేస్తుంటే ఇక్కడ అధికారులు కన్నెత్తి చూడడం లేదని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి మండిపడ్డారు. స్వర్ణముఖి నదిలో కలవకూరు గ్రామం వద్ద భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టి లారీలతో ఇతర ప్రాంతాలకు తరలిస్తుండడాన్ని శనివారం కిలివేటి సంజీవయ్య, కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పరిసర ప్రాంతాల రైతులు, పార్టీ శ్రేణులు కలిసి అడ్డుకున్నారు. యంత్రాలను పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో నెలవల కుటుంబం కొనసాగిస్తున్న దందాలు, అక్రమ దోపిడీ వ్యవహారం అంతా టీడీపీ నాయకులందరికీ తెలుసన్నా రు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన నెలవల కుటుంబ సభ్యులంతా దోచుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శించారు. పెళ్లకూరు మండలంలోని స్వర్ణముఖినది పరిహాక గ్రామాలైన పుల్లూరు, కలవకూరు, ముమ్మారెడ్డిగుంట, చింతపూడి, రావులపాడు, పిడికిటిమాల, యడపూడి తదితర గ్రామాలకు తాగు, సాగునీరు ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు.

అధికార పార్టీ నాయకుల అండతో దోపిడీ

కలవకూరు గ్రామం వద్ద స్వర్ణముఖినదిలో డీసిల్టింగ్‌కు ప్రభుత్వం అనుమతులిచ్చిందని కిలివేటి సంజీవయ్య తెలిపారు. పుల్లూరు సమీపంలో పాలచ్చూరు సఫ్లై చానల్‌ వద్ద 1.92 హెక్టార్లు, దిగువ కలవకూరు వద్ద 1.821 హెక్టార్లు విస్తీర్ణంలో స్వర్ణముఖినదిలోని పైపొరను రోజు వారి కూలీలతో తవ్వకాలు జరిపి, అవసరాల నిమిత్తం తీసుకెళ్లేందుకు డీఎల్‌ఎస్సీ జిల్లా అధికారులు అనుమతులు మంజూరు చేశారన్నారు. అయితే ఇక్కడి టీడీపీ నాయకుల అండతో సంబంధిత కాంట్రాక్టర్‌ ఇసుక దోపిడీకి పాల్పడి 1.50 లక్షల టన్నులు ఇసుక దోపిడీ చేసినట్లు ఆరోపించారు.

అడ్డూ అదుపూ లేకుండా

ఇసుక అక్రమ రవాణా

హైకోర్టును ఆశ్రయిస్తాం

నియోజక వర్గంలో జరుగుతున్న అక్రమ ఇసుక దోపిడీ గురించి, వివిధ శాఖల అధికారులు అవినీతి వ్యవహర శైలిపై గ్రీన్‌ట్రిబ్యునల్‌ను, హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి చెప్పారు. నదిలో తెగుగుగంగ జలాలు ప్రవహిస్తున్నా లెక్క చేయకుండా లారీలు రాకపోకలకు అనుకూలంగా స్వర్ణముఖిలోకి రోడ్డు ఏర్పాటు చేసుకుని యంత్రాలను నదిలోకి దింపి అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టడం అన్యాయమన్నారు. అక్రమ దోపిడీని అడ్డుకున్న రైతులను, నాయకులను టార్గెట్‌ చేస్తూ పోలీసు యంత్రాంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదన్నారు. స్వర్ణముఖినదిలోకి లారీలు, టిప్పర్లు రాకపోకల కోసం నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు ఏర్పాటు చేసుకుని, భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టి లారీలతో చైన్నె, తిరుపతి పట్టణాలకు తరలించి సొమ్ము చేసుకోవడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు నన్నం ప్రిస్కిల్లా, ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్‌రెడ్డి, రైతులు సురేష్‌రెడ్డి, సురేంద్రరెడ్డి, రమణారెడ్డి, కోటి, గురవయ్య, జితేంద్ర, బాలు, గోపాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement