అదుపులోకి 8 మంది అనుమానితులు,
6 వాహనాలు స్వాధీనం
22 లైసెన్స్ లేని షాపుల గుర్తింపు
తిరుమల: తిరుమలలో భక్తుల భద్రత, పవిత్రత పరిరక్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి న ఆపరేషన్ వజ్రపహార్‌లో భాగంగా శనివారం ఉద యం పాపవినాశనం ప్రాంతంలో విస్తృత స్థాయిలో నాకాబందీ తనిఖీ చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి మురళీకృష్ణ ఆదేశాల మేర కు, తిరుమల అదనపు ఎస్పీ సూచనలతో, తిరు మల డీఎస్పీ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. పోలీసులు, టీటీడీ విజిలెన్స్, ఏపీ ఫారెస్ట్, టీటీడీ ఫారెస్ట్, ఫైర్, టీటీడీ రెవెన్యూ, రెవెన్యూ బృందాలు, ఎకై ్సజ్, ఆరోగ్య శాఖకు చెందిన సుమారు 62 మంది సిబ్బంది మూడు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో పాపవినాశనం ప్రాంతంలోని షాపులను తనిఖీలు చేశారు.
పలు ఉల్లంఘనలు వెలుగులోకి..
ఈ తనిఖీల్లో మొత్తం 120 షాపులను పరిశీలించారు. ఈ సందర్భంగా సరైన గుర్తింపు కార్డులు లేని 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. గు ర్తింపు లేని 6 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్ లేకుండా నడుస్తున్న 22 షాపులను గుర్తించారు. 34 మంది అనుమానితుల వేలిముద్రలను సేకరించారు. గంజాయి, మద్యం, పొగాకు ఉత్పత్తులపై హెచ్చరిక షాపులు, హోటళ్లలో పనిచేస్తున్న సిబ్బంది, కార్మికులు గంజాయి, మద్యం, సిగరెట్లు, పొగాకు ఉ త్పత్తులు వంటి నిషేధిత వస్తువులు వినియోగించకూడదని, తిరుమలకు తీసుకురావద్దని అధి కారులు కఠినంగా హెచ్చరించారు. అలాగే, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా, వారిలో భక్తిభావం పెంపొందేలా ప్రవర్తించాలని సూచించారు.
డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ
స్థానిక యువత, కార్మికులతో కలిసి డ్రగ్స్ రహిత సమాజం కోసం పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. ఈ నాకాబందీ కార్యక్రమానికి స్థానికులు పూర్తిస్థాయిలో సహకరించినట్లు అధికారులు తెలిపారు.
పాపవినాశనం వద్ద
20 షాపుల తనిఖీ
స్థానికులకు అవగాహన.. అపరిచితులకు షాపులు ఇవ్వొద్దు
ఈ సందర్భంగా స్థానికులతో సమావేశమైన అధికారులు, అపరిచిత వ్యక్తులకు షాపులు అద్దెకు ఇవ్వకూడదని, సరైన గుర్తింపు లేకుండా ఎవరినీ పనిలో పెట్టుకోవద్దని సూచించారు. అలాగే, ఫారెస్ట్ శాఖ నిబంధనలు పాటించి వన్యప్రాణులకు హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా ఎవరూ ప్రవర్తించవద్దని స్పష్టం చేశారు. ‘ఆపరేషన్ వజ్రపహార్’ సదుద్దేశాన్ని ప్రజలకు వివరించిన అధికారులు, అవసరమైనప్పుడు వినియోగించాల్సిన అత్యవసర నంబర్లు 1972, 112పై అవగాహన కల్పించారు.
కేటాయించిన వారే షాపులు నిర్వహిస్తున్నారా?
టీటీడీ, ఫారెస్ట్ శాఖలు కేటాయించిన వారే షాపులు నిర్వహిస్తున్నారా..? లేక కొత్త వ్యక్తులు అక్రమంగా కొనసాగిస్తున్నారా..? అనే కోణంలో ప్రత్యేకంగా తనిఖీలు జరిపారు. షాపులు నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్నాయా..? లైసెన్సులు చెల్లుబాటు అవుతున్నాయా..? అక్కడ పనిచేస్తున్న కార్మికుల పూర్తి వివరాలు సరిచూశారు. ప్రతి శాఖ తమ పరిధిలోని అంశాలపై విడివిడిగా క్షుణ్ణంగా పరిశీలన చేపట్టింది.


