ఎస్వీయూ అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి
తిరుపతి సిటీ: ఎస్వీయూలో నిబంధలను తుంగలో తొక్కి అన్ని అర్హతలుండి అకడమిక్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న తనని అధికారులు తొలగించడం దారుణమని తాత్కాలిక అధ్యాపకుడు డాక్టర్ ఎస్ శివశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వర్సిటీ అధికారులపై కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఏడేళ్లుగా వర్సిటీలో కామర్స్ విభాగంలో తాత్కాలిక అధ్యాపకుడిగా పనిచేస్తున్నానని, ఇటీవల వర్సిటీ అధికారులు ఫర్‌ఫార్మెన్స్ రివ్యూ పేరుతో తాత్కాలిక అధ్యాపకులకు ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హత ఉన్నవారిని సైతం తొలగించడం దారుణమన్నారు. విద్యార్హతలతో పాటు, అధ్యాపక అర్హత పరీక్షలో సైతం ఉత్తీర్ణులయ్యానని, ఆ విభాగంలో పనిచేస్తున్న ఏ అధ్యాపకునికి ఇటువంటి అర్హతలు లేవన్నారు. తాను పనిచేసిన విభాగంలో వంద శాతం ఫలితాలు సాధించి రికార్డు సృష్టించి మెరిట్ శాలరీ సైతం అందుకున్నానని తెలిపారు. సాక్షాత్తు రిజిస్ట్రార్ తన చాంబర్‌లో తనతో మాట్లాడుతూ లంచం ఇవ్వలేవు.. రాజకీయంగా సపోర్టు లేదు.. ఎలా నిన్ను కొనసాగించాలంటూ నేరుగా అడిగారని ఇందుకు సంబంధించిన సీసీ పుటేజ్‌ను సైతం పోలీసులు తనిఖీ చేయాలని కోరారు.
ముగిసిన పురందరదాసు ఆరాధనోత్సవాలు
తిరుమల: తిరుమలలో మూడురోజులుగా టీటీడీ దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న పురందరదాసు ఆరాధన మహోత్సవాలు సోమవారంతో ముగిశాయి. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ మానవ జీవన విధానంలో ఎదురయ్యే సమస్యలకు పూర్వజన్మ కర్మ ఫలమే కారణమన్నారు. దీని నుంచి బయట పడటానికి మహాత్ములను సందర్శించి, వారి మార్గదర్శకంలో భగవంతుడిని సేవించడం ద్వారా మోక్షం పొందవచ్చన్నారు. అలాగే 4.75 లక్షల సంకీర్తనలు రచించడం సాక్షాత్తు నారద స్వరూపులైన పురందరదాసుకే సాధ్యమైందని తెలిపారు.
ఎస్వీయూ అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి
ఎస్వీయూ అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి


