పేకాట స్థావరంపై దాడులు | - | Sakshi
Sakshi News home page

పేకాట స్థావరంపై దాడులు

Jan 20 2026 7:29 AM | Updated on Jan 20 2026 7:29 AM

పేకాట

పేకాట స్థావరంపై దాడులు

డక్కిలి: మండలంలోని మిట్టవడ్డిపల్లి శివారు ప్రాంతంలో పేకాట స్థావరంపై డక్కిలి ఎస్‌ఐ శివ శంకర్‌ తన సిబ్బందితో కలిసి సోమవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో ఏడుగురు జూదరులు, నాలుగు సెల్‌ఫోన్లు, రూ,3750 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఫిబ్రవరిలో విశేష పర్వదినాలు

తిరుమల: ఫిబ్రవరి నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు టీటీడీ ప్రజాసంబంధాల విభాగం సోమవారం వెల్లడించింది. ఫిబ్రవరి 1న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడ సేవ, 3న తిరుమొళి శైయాళ్వార్‌ వర్ష తిరు నక్షత్రం, 6న కూరత్తాళ్వార్‌ వర్ష తిరు నక్షత్రం, 26న శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం, 28న కుళశేఖరాళ్వా ర్‌ వర్ష తిరు నక్షత్రం నిర్వహించునున్నారు.

వందరోజుల ప్రణాళికను పక్కాగా అమలు

తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్‌ ఆదేశించిన వందరోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయా లని డీఈఓ కేవీఎన్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 317 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ప్రణాళికలో భాగంగా ఉదయం, సాయంత్రం ఒక గంట పాటు అదనపు తరగతులు నిర్వహించి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, ఎంఈఓలు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలన్నారు. తరగతుల్లో విద్యార్థుల సామర్థాన్ని మదింపు చేసేందుకు ప్రతి సబ్జెక్టులో 20 మార్కులకు క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించి లీఫ్‌ యాప్‌లో ఉపాధ్యాయులు నమోదు చేయాలని ఆదేశించారు.

వచ్చేనెల 2 నుంచి

ఏపీఆర్‌ సెట్‌ ఇంటర్వ్యూలు

తిరుపతి రూరల్‌: ఏపీఆర్‌సెట్‌–2024కు సంబంధించి అర్హత సాధించిన విద్యార్థులకు వచ్చేనెల 2 నుంచి 6వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నుంచి సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధానంగా పద్మావతి మహిళా వర్సిటీ, ఎస్వీయూ, ఆంధ్రవర్సిటీ, ఆచార్య నాగార్జున వర్సిటీ, కాకినాడ, అనంతపురం జేఎన్‌టీయూలలో ఇంటర్వ్యూల ప్రక్రియను చేపట్టాలని అధికారులు సంబంధిత వర్సిటీలకు ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆ ప్రకటనలో తెలిపారు.

గణేష్‌ రెడ్డి అదృశ్యం

శ్రీకాళహస్తి: మండలం తిరుమంజికండిగ (టీఎంయూ కండిగ) గ్రామానికి చెందిన ఎం. మునెమ్మ కుమారు డు గణేష్‌ రెడ్డి ఈ నెల 5 వ తేదీ నుంచి కనిపించడం లేదని ఆయన భార్య గీత ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ఇంట్లో స్వల్ప వివాదం కారణంగా గణేష్‌ రెడ్డి అలిగి బయటకు వెళ్లాడు. గతంలో కూడా పలుసార్లు ఇలాగే వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన సందర్భాలు ఉండడంతో బంధువులు, చుట్టాల ఇళ్ల వద్ద వెతికించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రోజులు గడుస్తున్నా జాడ లభించకపోవడంతో తల్లి మునెమ్మ, భార్య గీత తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై శ్రీకాళహస్తి రూరల్‌ పోలీసులను ఆశ్రయించిన కుటుంబ సభ్యులు, తమ భర్తను గుర్తించి, అప్పగించాలని ఫిర్యాదు ఇచ్చినట్టు తెలిపారు.

సీఆర్పీలతోనే సంఘాల్లో పారదర్శకత

తిరుపతి రూరల్‌: సీఆర్పీలు పని చేసే విధానంతోనే సంఘాల్లో పారదర్శకత ఉంటుందని డీపీఎం ఐబీ వెంకటేష్‌ తెలిపారు. తిరుపతి రూరల్‌ మండల సమాఖ్య సమావేశ మందిరంలో సీఆర్పీలకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణకు డీపీఎం ఐబీ వెంకటేష్‌ హాజరయ్యా రు. ఆయన మాట్లాడుతూ ఈ–నారి, సీఆర్పీలు ప్రతి 10 సంఘాలకు ఒక్కరిని నియమించినట్లు తెలిపారు. అలాగే 25 సంఘాలు దాటినా వీఓఏ ల్లో ఇద్దరు జీవనోపాధులకు సంబంధించి ఇద్దరు సీఆర్పీలను నియమించామన్నారు. అలాగే వారికి కేటాయించిన సంఘాల్లో సమావేశాలకు హాజరుకావడం, సంఘాల పుస్తకాలు రాయడం, సంఘ సమావేశంలో ఆర్థిక లావాదేవిలు వీఓఏలకు స మర్పించి వారితో లైవ్‌ మీటింగ్స్‌ డేటా అప్డేట్‌ చేయించాలన్నారు. ఏపీఎం నాగేశ్వరరావు, దు ర్వాసులు నాయుడు, సీసీలు చిత్ర, రవి, రమేష్‌, ధనుంజయ, వాహిని , సుజాత పాల్గొన్నారు.

పేకాట స్థావరంపై దాడులు 
1
1/1

పేకాట స్థావరంపై దాడులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement