కలెక్టరేట్‌కూ కరెంట్ కట్
తిరుపతి అర్బన్: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.40 గంటల వరకు విద్యుత్ సరఫరా లేదు. దీంతో పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన అర్జీదారులకు తిప్పులు తప్పలేదు. చీకటిలోనే అధికారులు పీజీఆర్‌ఎస్ అర్జీలను స్వీకరించారు. అర్జీలను అన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయడానికి కరెంట్ లేకపోవడంతో 50 శాతం మంది అర్జీదారులు వచ్చే వారం తీసుకుందామంటూ వెళ్లిపోయారు. మరో 50 శాతం మంది అర్జీదారులు అక్కడే పడిగాపులు కాశారు. 12.40 గంటలకు కరెంట్ రావడంతో అక్కడే ఉన్న అర్జీదారులు ఒక్కొక్కరుగా రసీదులు స్వీకరించారు. విద్యుత్ వైర్ల సమస్యలతో ఆ భవనం వరకు మాత్రమే విద్యుత్ అంతరాయం చోటుచేసుకుంది.
పీజీఆర్‌ఎస్‌కు 251 అర్జీలు
కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 251 అర్జీలు వచ్చాయి. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్‌మాండ్, సుధారాణి అర్జీలను అందుకున్నారు.
శెట్టిపల్లి జాబితాలో మా పేర్లు చేర్చండి
శెట్టిపల్లిలో ఆది నుంచి మాకు పట్టాలున్నాయని..తాజాగా అధికారులు ప్రకటించిన జాబితాలో మా పేర్లు ఎందుకు చేర్చలేదంటూ పలువురు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వారి ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో పరిశీలించి, న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు బాధితులు వెల్లడించారు.
పింఛన్‌కు అనుమతులు వచ్చాయా?
కేవీబీపురం మండలంలోని ఎస్‌ఎల్ పురం ఎస్టీకాలనీకి చెందిన ఇ. సుబ్బమ్మ ఇ.బాలాజీ 2024 మార్చిలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో అతడికి ఓ కాలు తీసివేశారు. తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి పింఛన్ కోసం తిరుగుతోంది. ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదని చెబుతున్నారు. ఎప్పుడు వస్తాయి సార్ అంటూ ఆమె దివ్యాంగుడైన తమ కుమారుడితో అధికారులకు మొరపెట్టుకున్నారు.
కలెక్టరేట్‌కూ కరెంట్ కట్
కలెక్టరేట్‌కూ కరెంట్ కట్


