విన్నపానికి
అన్నదమ్ముల భాగపరిష్కార సమస్యలు
ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని తమదంటే తమదంటూ అర్జీలు
బలహీనులు, వృద్ధులకు చెందిన భూములు తమవంటూ వివాదాలు
భూములు ఆన్‌లైన్ చేయాలని..
భూములకు పాస్ పుస్తకాలు ఇవ్వాలని..
తమ ఆధీనంలో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వాలని..
కొత్త డి.పట్టా మంజూరు
డి.పట్టా భూమికి అన్‌లైన్, 1బీ మంజూరు
వెబ్‌ల్యాండ్‌లో ఉన్న సున్నా విస్తీర్ణాన్ని సవరించడం
డి.పట్టా భూమి ఆక్రమణ
తప్పుడు మ్యుటేషన్‌పై ఫిర్యాదులు
ప్రభుత్వ భూములు ఆక్రమణ
రీసర్వేలో బోలెడు సమస్యలు
ఆన్‌లైన్ సబ్ డివిజన్ ద్వారా జాయింట్ ఎల్పీఎం విడదీత
ఆన్‌లైన్ సబ్ డివిజన్ ద్వారా సింగిల్
ఎల్పీఎంల విడదీత
సమస్యలు బోలెడు.. సమయం 3 గంటలే
●
ప్రైవేటు సైట్‌లో మరో వ్యక్తి బోర్డు
ఈయన పేరు గణేష్‌నాయుడు, చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుచానూరు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈయన వయస్సు 80 ఏళ్లు. ప్లాట్ నంబర్ 49, సర్వే నంబర్ 264లో చుట్టు ప్రహరీగోడ ఏర్పాటు చేసుకున్నారు. అయినా మరోవ్యక్తి ఈ స్థలం తమదంటూ బోర్డు పెట్టారని ఆయన సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి అర్జీని అధికారులకు ఇచ్చి, న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు.
తిరుపతి అర్బన్: రెవెన్యూ సమస్యలు పేరుకుపోతున్న నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ కొత్తరాగం అందుకుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే రెవె న్యూ సమస్యలకు పరిష్కారం చూపుతామని చె ప్పి న ఆయన గత ఏడాది చేపట్టిన రెవెన్యూ సదస్సులతో సమస్యలకు సరైన ఫలితాలు చూపలేదు. దీంతో ఈ ఏడాది కొత్తగా కలెక్టరేట్‌లో ప్రతి సోమ వా రం ఓ వైపు పీజీఆర్‌ఎస్.. మరోవైపు రెవెన్యూ క్లినిక్‌లను నిర్వహించాలని ఆదేశించారు. ఆ మేరకు రాష్ట్రమంతటా ప్రతి సోమవారం పీజీఆర్‌ఎస్‌తోపాటు రెవెన్యూ క్లినిక్ల్‌ను రెండు వారాలుగా చేపడుతున్నా రు. అయితే తిరుపతి జిల్లాలో మాత్రమే రెవెన్యూ క్లినిక్ల్‌ను సోమవారం పీజీఆర్‌ఎస్‌లో వద్దని అధికారులు నిర్ణయించుకున్నారు. జిల్లాలో సమస్యలు ఎక్కువగా ఉన్న క్రమంలో సోమవారం కాకుండా ప్రత్యేకంగా ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో రోజు కలెక్టరేట్‌లోనే రెవెన్యూ క్లినిక్‌లను చేపట్టాలని నిర్ణయించారు. ఆ మేరకు గురువారం ముందుగా జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి రెవెనూ క్లినిక్‌ను చేపడుతున్నారు. తర్వాత వారంలో ఒక్కరోజు ఒక్కో నియోజకవర్గానికి రెవెన్యూ క్లినిక్ చేపట్టనున్నారు.
సమస్యలు బోలెడు...సమయం 3 గంటలే!
నిర్దిష్టకాల వ్యవధిలో పరిష్కారం చూపాల్సి ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యంతో ఎక్కడి అర్జీలు అక్కడే పేరుకుపోతున్నాయి. 19 నెలల చంద్రబాబు పాలనలో 62,500 అర్జీలను అధికారులకు పీజీఆర్‌ఎస్‌లో ఇచ్చారు. అందులో 36,700 అర్జీలు రెవెన్యూ సమస్యలపై ఉన్నాయి. ఈ సందర్భాల్లో పరిష్కారం కోసం కొందరు కలెక్టరేట్ వద్ద పెట్రోల్, కిరోసిన ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నం పాల్పడుతున్న ఘటనలే కాకుండా కలెక్టరేట్ వద్ద దీక్షలు చేస్తున్న వారు మరికొందరు. పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీల్లో 55శాతం రెవెన్యూ సమస్యలపైనే ఉంటున్నాయి. అయితే కలెక్టరేట్‌లో ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు మాత్రమే రెవెన్యూ క్లినిక్ చేపట్టనున్నారు. కేవలం 3 గంటల సమయంలో అర్జీలను ఎప్పుడు స్వీకరిస్తారు, వారి సమస్యలను ఎప్పుడు నిశితంగా వింటారు, ఆ తర్వాత ఎప్పుడు వాటికి పరిష్కారం చూపుతారని పలువురు చర్చించుకుంటున్నారు.
ప్రధాన భూ సమస్యలివీ
ప్రభుత్వ భూమి ఆక్రమించి చెట్లు నాటేశారు!
ఈయన పేరు నాగరాజు, ఎర్రవారి పాళెం మండలంలోని చెరుకువారి పల్లి గ్రామం. దశాబద్దాలుగా ప్రభుత్వ భూమిలో నుంచి బండి బాట మీదుగా అవతల వైపు ఉన్న ఆయన పది ఎకరాల పొలంలోకి వెళుతున్నారు. అయితే తాజాగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి చెట్లు నాటి, దారి మూసివేశారంటూ కలెక్టరేట్‌లో సోమవారం మొరపెట్టుకున్నారు.
మా మరదలు మా ఆస్తిని కొట్టేసింది!
నా పేరు ఎం. పట్టాభి. మాది తిరుపతి జిల్లాలోని నారాయణవనం మండలం వెలత్తూరు కండ్రిగ. మేము నలుగురు అన్నదమ్ముళ్లం, మాకు తిరుపతిలో మూడు ఇళ్లు ఉన్నాయి. అయితే ఆ మూడు ఇళ్లు మా తమ్ముడు ఎం.ధనపాల్ భార్య ఎం.అశ్వని మోసం చేసి, ఆమె పేరుపై అన్‌లైన్ చేసుకుంది. మాకు న్యాయం చేయాలని కలెక్టరేట్ వద్ద సోమవారం అధికారులను కోరారు.
విన్నపానికి
విన్నపానికి
విన్నపానికి
విన్నపానికి


