గతం కంటే భిన్నంగా ఫెమింగో ఫెస్టివల్
సూళ్లూరుపేట: నియోజకవర్గం కేంద్రంగా నిర్వహించబోయే ఫ్లెమింగో ఫెస్టివల్‌ను గతంలో కంటే భి న్నంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్‌తోపాటు ఎస్పీ సుబ్బారాయుడు, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, జిల్లా అధికారులు తొలుత నేలపట్టు పక్షులు రక్షిత కేంద్రాన్ని, సూళ్లూరుపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు. భీములవారిపాళెం పడవల రేవు వద్ద టూరిజం శాఖకు చెందిన బ్రోచర్, సూళ్లూరుపేటలోని ఫ్లెమింగో ఫెస్టివల్ గ్రౌండ్‌లో పక్షులు పండుగకు సంబంఽధించిన బ్రోచర్‌ను విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాది మూడు రోజులు పండుగ నిర్వహించామని, అప్పుడు నిధులు చాలకపోవడంతో ఈ సారి పండుగను రెండు రోజులకే కుదించామని తెలిపారు. అయితే గతంలో కంటే భిన్నంగా పండుగ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్సీ, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ఆర్డీఓలు కిరణ్మయి, భానుప్రకాష్‌రెడ్డి, వెంకటగిరి డీఎఫ్‌ఓ శ్రీకాంత్, మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్‌రెడ్డి, జిల్లా టూరిజం అధికారి ఆర్‌డీ రమణ ప్రసాద్, డీఎస్‌డీఓ శశిధర్, సెట్విన్ సీఈఓ యశ్వంత్, డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్, డీఈఓ కుమార్, తహసీల్దార్ గోపీనాథ్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య, వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ ఆకుతోట రమేష్ తదితరులు పాల్గొన్నారు.
పడవల రేవును పరిశీలించిన కలెక్టర్
తడ: మండలంలో ఈ నెల 10, 11 తేదీల్లో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్‌పీ సుబ్బరాయుడు, ఎమ్మెల్యే విజయశ్రీ ప్రజా ప్రతినిధులతో కలిసి బుధవారం పరిశీలించారు. బీవీపాళెం పడవ రేవు నుంచి పులికాట్ సరస్సు మీద పడవల షికారుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.
గతం కంటే భిన్నంగా ఫెమింగో ఫెస్టివల్


