మారిషస్ దేశాధ్యక్షుడికి సాదర వీడ్కోలు
రేణిగుంట: తిరుపతి జిల్లా రెండు రోజుల పర్యటన ముగించుకొని బుధవారం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణం అయినా మారిషస్ దేశాధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ జీసీఎస్‌కేకు విమానాశ్రయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రె డ్డి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సు బ్బారాయుడు, ధరంబీర్ గోకుల్ దంపతులను కలంకారి శాలువాతో సత్కరించి, శ్రీవారి ప్రతిమను బహుకరించి, సాదర వీడ్కోలు పలికారు. శ్రీకాళహస్తి ఆర్టీఓ భాను ప్రకాష్‌రెడ్డి, రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.
మహిళా వర్సిటీ రిజిస్ట్రార్‌గా ఆచార్య ఉష
తిరుపతి రూరల్: శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్‌గా బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఉషను నియమించారు. ఆ మేరకు ఆమె గురువారం పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ నెల 5వ తేదీకి పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.రజనీ పదవీ కాలం ముగియడంతో నూతన రిజిస్ట్రార్‌ను నియమించారు. ఈ క్రమంలో బుధవారం పూర్వ రిజిస్ట్రార్ రజనీకి వర్సిటీ తరఫున సాదరంగా వీడ్కోలు పలికారు. వర్సిటీ సెమినార్‌హాల్‌లో జరిగిన వీడ్కోలు స మావేశానికి పలువురు అధ్యాపకులు, అధికారు లు హాజరై ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు. వైస్‌చాన్సలర్ ఆచార్య వి.ఉమ మాట్లాడుతూ స మర్థవంతమైన, పారదర్శకమైన పరిపాలనను అందించడంలో రజనీకి సాటిలేరని ప్రశంసించా రు. అనంతరం పదవీ బాధ్యతలు స్వీకరించను న్న నూతన రిజిస్ట్రార్ ఆచార్య ఆర్.ఉష, డిప్యూటీ రిజిస్ట్రార్ డా. బి.గీతావాణి మాట్లాడుతూ వర్సిటీ లో అభివృద్ధి పనులు, బోధన పరమైన విషయా ల్లో రజనీ కీలక నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ఆచరణలోకి తీసుకువచ్చారన్నారు.
మారిషస్ దేశాధ్యక్షుడికి సాదర వీడ్కోలు


