హెల్మెట్ బాధ్యత కాదు భద్రత
తిరుపతి క్రైం: హెల్మెట్ అనేది బాధ్యత కాదు అది భద్రత అని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని జి ల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బరాయుడు సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుంచి టౌన్‌క్లబ్ వరకు హెల్మెట్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో సుమారు 700 మంది పో లీసులు పాల్గొని, ప్రజలకు అవగాహన కల్పించా రు. అనంతరం ట్రాఫిక్ పోలీసులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. అంతకుముందు కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల్లో భద్రతా చైతన్యాన్ని మరింతగా పెంచడమే ప్రధాన లక్ష్యంగా పోలీసు యంత్రాంగం చర్యలు చేపడుతుందన్నారు. ఇటీవల ద్విచక్ర వాహనాల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాణనష్టం నివారణకు హెల్మెట్ వినియోగం అత్యంత కీలకమని అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, బీట్ సిబ్బంది నేరుగా రంగంలోకి దిగారన్నారు. జిల్లాలో అమలులో ఉన్న నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధన ప్రకారం హెల్మెట్ లేకుండా వచ్చేవారికి పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఇవ్వకూడదని ఆదేశించారు. అలాగే నో హెల్మెట్ నో రైడ్ కార్యక్రమం ద్వారా చిన్న దూరానికై నా హెల్మెట్ లేకుండా ప్రయాణించకూడదని, వాహనం నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే సందేశాన్ని బలంగా ప్రచారం చేస్తున్నామన్నారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి వ్యక్తితోపాటు, వెనుక కూర్చునే వ్యక్తి కూడా తప్పనిసరిగి హెల్మెట్‌ను ధరించాలని సూచించారు.
జరిమానాల విధించడం మా లక్ష్యం కాదు
పోలీసుల లక్ష్యం జరిమానాలు విధించడం కాదని, రోడ్డు ప్రమాదాలను నివారించడమే ప్రధాన ఉద్దేశమని కలెక్టర్, ఎస్పీ తెలిపారు. సోషల్ మీడియా రీల్స్, వీడియోల కోసం నిర్లక్ష్యంగా బైక్ నడపకుండా యువత తమ జీవిత విలువను గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవి మనోహర్ ఆచారి, నాగభూషణం, శ్రీనివాసులు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్ అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
హెల్మెట్ బాధ్యత కాదు భద్రత


