ఐఐటీలో రసవత్తరంగా క్రీడా పోటీలు
ఏర్పేడు: తిరుపతి ఐఐటీ ఇండోర్ స్టేడియంలో క్రీడా పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. 58వ ఇంటర్ ఐఐటీ స్పోర్ట్స్ మీట్‌లో రెండో రోజు టెన్నిస్ లీగ్ మ్యాచ్‌లు, చదరంగం మ్యాచ్‌లు హోరాహోరీగా జరిగాయి. డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ విద్యార్థులతో కలసి చదరంగం ఆడి పోటీలను ప్రారంభించారు.
ముందంజలో కాన్పూర్ ఐఐటీ విద్యార్థులు
చదరంగం లీగ్ పోటీలో మొదటి రౌండ్ తర్వాత ఐఐటీ కాన్పూర్ 4 పాయింట్లతో ముందంజలో నిలిచింది. ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ గౌహతి 3.5 పాయింట్లతో దగ్గరగా ఉన్నాయి.
వెయిట్‌లిఫ్టింగ్ అధికారిక ఫలితాలు
రెండో రోజున సోమవారం 60 కిలోల (గ్రూప్ ఏ, గ్రూప్ బీ), 65 కిలోల (గ్రూప్ ఏ) విభాగాల్లో వెయిట్‌లిఫ్టింగ్ ఈవెంట్లు జరిగాయి. సోమవారం విజేతలను ప్రకటించారు. ఈ పోటీలు ఈనెల 21వ వరకు జరగనున్నాయి.


