రాష్ట్రపతి పర్యటనపై సమీక్ష
రేణిగుంట: భారత రాష్ట్రపతి ద్రౌపదిము ర్ము, ఈ నెల 17న, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ నెల 16, 17 తేదీల్లో తి రుపతి జిల్లా పర్యటన సందర్భంగా సో మవారం రేణిగుంట విమానాశ్రయంలో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయు డు, అధికారులతో సమన్వయ సమావే శం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాష్ట్రపతి ఈ నెల 17వ తేదీన తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లాలోని స్వర్ణ దేవాలయం దర్శనార్థం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా వేలూరు వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. అనంత రం తిరిగి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారన్నారు. ఇంటెలిజెన్స్ అధికారి నాగబాబు, అడిషనల్ ఎస్పీలు రవి మనోహరాచారి, శ్రీనివాస రావు, నాగభూషణ రావు, వెంకటరాముడు, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్‌రెడ్డి, విమానాశ్రయ డైరెక్టర్ భూమినాథన్, సీఐఎస్‌ఎఫ్ అధికారి అనురాగ్ యాదవ్, ఐబీ అధికారి శిరీష, డీఎస్పీలు రామకష్ణాచారి, చంద్రశేఖర్, భక్తవత్సలం, రామకృష్ణ, చిరంజీవి, ప్రసాద్, రాంబాబు, అంకారావు, వెంకటనారాయణ, డీఎఫ్‌ఓ రమణయ్య పాల్గొన్నారు.


