వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మీడియా ఫ్యానలిస్టుకు నోటీసు
తిరుపతి మంగళం : వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మీడియా ఫ్యానలిస్టు పసుపులేటి సురేష్‌పై తిరుపతి నగరంలోని జనసేన నాయకులు పెట్టిన అక్రమ కేసులకు సోమవారం ఈస్ట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పసుపులేటి సురేష్ విచారణ నిమిత్తం ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ శ్రీనివాసులు వద్ద హాజరయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తూ రెడ్‌బుక్ పాలన సాగిస్తూనే ఉన్నారని పసుపులేటి సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు
శ్రీకాళహస్తి:మున్సిపల్ కమిషనర్ పి.భవాని ప్రసా ద్, టౌన్ ప్లానింగ్ అధికారి శారదపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. సిరి అనే యువతి నిర్వహిస్తున్న షాపుపై కోర్టు స్టే ఉన్నప్పటికీ కూల్చివేశారన్న ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు. సీసీఎస్‌ఆర్ 51814/2025 నంబర్‌తో కేసు నమోదు కాగా, త్వరలో హైకోర్టులో విచారణకు రానుంది.


