శ్రీవారి సేవలో వనమాలి మఠాధిపతి
తిరుమల: నంగునేరిలోని వనమాలి మఠాధిపతి పరమహంస ఇత్యాధి మధురకవి రామానుజ జీయర్ స్వామి సోమవారం శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల బేడి ఆంజనేయ స్వామి వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, అధికారులు, అర్చకులు ఆలయ మ ర్యాదలతో స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు.
టీటీడీ చైర్మన్‌కే లేని బౌన్సర్లు సురుటుపల్లి చైర్మన్‌కు ఎందుకు?
సాక్షి టాస్క్‌ఫోర్స్: నాగలాపురం మండలంలోని సురుటుపల్లి పల్లికొండేశ్వరస్వామి ఆలయం భక్తిక్షేత్రంగా వెలుగొందాల్సిన చోట సోమవారం అధి కారదర్పం నిండిపోయింది. ఆలయ దర్శక మండలి చైర్మన్ పద్మనాభరాజు అత్యుత్సాహం భక్తుల మనసులో ఆవేదన రేపింది. ఆయన నేతృత్వంలో సోమవారం జరిగిన ధర్మకర్తల మండలి ఆత్మీయ సమావేశం స్వప్రచార సభగా మారింది. పిచ్చాటూరు నుంచి ర్యాలీగా బయలుదేరిన బృందం సురుటుపల్లికి చేరి, శివాలయ పవిత్రతను ఆర్పాటాల బారున పడేసింది. భక్తి ప్రాంగణంలో బౌన్సర్ల బల ప్రదర్శన చేయించి, భక్తుల భావాలను తునాతునకులు చేసిన చైర్మన్ పద్మనాభరాజుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సురుటుపల్లి చైర్మన్ పదవికే ఇంత హంగామానా? ఇంక టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే ఇంకా ఏం చేస్తారో.. ఏమో అని ఆలయానికి వచ్చిన భక్తులు, స్థానిక ప్రజలు గుసగుసలాడుకున్నారు. అంతా చూస్తూ ఆలయ ఈఓ లత మౌనంగా పాటించడం మరింత అనుమానాలకు దారితీస్తుంది. శివాలయం బౌన్సర్ల ప్రాంగ ణం కాదు. భక్తుల ప్రణామాల పుణ్య క్షేత్రం అని పద్మనాభ రాజు గుర్తించుకోవాలని అంటున్నారు.
దేవాలయాలపై రాజకీయమా?
రామచంద్రాపురం: మండలంలోని రేఖలచేను సమీపంలోని జన్మస్థల శివాలయం కూల్చివేతకు కోర్టు అనుమతి మంజూరు కావడంతో భక్తులు మండిపడుతున్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద హిందూ సమాజం భ క్తులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. వారికి వైఎస్సార్‌సీపీ నాయకులు సంఘీభావం తెలిపా రు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి హిందూ దేవాలయాలపై కక్ష ధోరణితో వ్యవహరిస్తోందని స్థానికు లు విమర్శిస్తున్నారు. రామచంద్రాపురం, వెదురుకుప్పం, చంద్రగిరి మండలాల భక్తులు, ప్రజాప్రతినిధులు, పెద్దలు కలిసి తహసీల్దార్, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశా రు. ప్రభుత్వ భూమిలో ఉందనే పేరుతో ఆలయా న్ని కూల్చాలన్న నిర్ణయం హిందువుల మనో భావాలను దెబ్బతీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 500 మంది భక్తులు సంతకాలతో కూడిన వినతిపత్రం సమర్పించగా, ఆలయ ట్రస్ట్‌కు ప్రభుత్వ అధికారులచే నోటీసులు అందినట్లు సమాచారం.
శ్రీవారి సేవలో వనమాలి మఠాధిపతి


