వైఎస్సార్ సీపీలో చేరిన టీడీపీ యువ నాయకులు
చిట్టమూరు: మండలంలోని మేజర్ పంచాయతీ మ ల్లాంలో పలువురు టీడీపీ యువ నేతలు వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మల్లాం మాజీ సర్పంచ్ దువ్వూరు శేషురెడ్డి ఆధ్వర్యంలో సోమ వారం మల్లాం పంచాయతీ కొక్కుపాళెనికి చెందిన టీడీపీ యువ నేతలు కావలి సునీల్, డమ్మాయి ము త్యాలయ్య తమ అనుచరులతో కలసి పార్టీలో చేరా రు. కొత్తగా పార్టీలో చేరిన వారికి దువ్వూరు శేషురెడ్డి పార్టీ కండువాలు కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో మల్లాం పంచాయతీలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సందర్భంగా దువ్వూరు శేషురెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చలేదన్నారు. టీడీపీ తప్పులు ఎత్తి చూపిన వారిపై అక్రమ కేసులు బనాయించి, భయభ్రాంతులకు గురి చేస్తుందన్నారు. దీంతో ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న అపార నమ్మకంతో ఆయన్ని 2029 ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలు వైఎస్సార్‌సీపీలోకి స్వచ్ఛందంగా వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు తిరుమూరు అశోక్, మాజీ సర్పంచ్ చెన్నయ్య, వైఎస్సార్‌సీపీ యువ నాయకులు నాగరాజు, సునీల్, నరేష్, మీరాజ్ పాల్గొన్నారు.


