శెట్టిపల్లెలో త్వరలో ప్లాట్ల కేటాయింపు
తిరుపతి అర్బన్: శెట్టిపల్లిలో త్వరలో ప్లాట్స్, భూముల కేటాయింపు జరుగుతుందని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం ఆయన కలెక్టరేట్ తుడా చైర్మన్ దివాకర్‌రెడ్డితో కలసి అధికారులతో సమీక్షించారు. ప్లాట్ల కేటాయింపులతో పాటు అన్ని వసతులు కల్పించడానికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రధానంగా తాగునీరు, డ్రైనేజ్, విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మోహన్, జిల్లా రిజిస్టార్ శ్రీరామకుమార్, జిల్లా సర్వే అధికారి అరుణ్‌కుమార్, తుడా చీఫ్ ప్లానింగ్ అధికారి దేవి కుమారి, తుడా భూ సేకరణ అధికారి సుజన, తుడా సెక్రటరీ శ్రీకాంత్ బాబు, అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి వాణిశ్రీ, సూర్యనారాయణమ్మ, వాసుదేవనాయుడు ఎస్‌ఈ కృష్ణారెడ్డి, తిరుపతి అర్బన్ తహసీల్దార్ సురేష్, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, తుడా సర్వేయర్ దేవానంద్ పాల్గొన్నారు.


