
ఓబీసీల హక్కుల సాధనే లక్ష్యం
● సౌత్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు
తిరుపతి కల్చరల్: ఓబీసీల హక్కుల సాధనే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తామని సౌత్ ఇండియా ఓబీసీ వె ల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు తెలిపారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడలో ఈనెల 12వ తేదీన జరిగిన సౌత్ ఇండి యా ఓబీసీ సెమినార్‌లో దక్షిణాదితోపాటు ఉత్తరాది రాష్ట్రాల ఓబీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొని, ఓబీసీ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేయడంతోపాటు సౌత్ ఇండియా ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నిక నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలో జనగణనలో కులగణన శాసీ్త్రయ పద్ధతిగా చేపట్టాలని, జనాభా ప్రాతిపదికన తమ వాటా హక్కు లను తమకు కేటాయించాలన్నారు. తెలంగాణ తరహాలో 42 శాతం స్థానిక సంస్థల్లో బీసీలకు కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు