
టీటీడీ చొరవ చూపాలి
టీటీడీ విద్యా సంస్థలలో చదువుకోవడం అదృష్టంగా విద్యార్థులు బావిస్తారు. అయితే హాస్టల్ సీట్లు దక్కకపోవడంతో చాలా మంది టీసీలు తీసుకుని వెళ్లిపోతున్నారు. ఈ విషయంలో టీటీడీ చొరవ చూపాలి. ఇంటర్‌లో 950 మార్కులు సాధించిన విద్యార్థినికి పద్మావతి కళాశాలలో హాస్టల్ సీటు దక్కకపోవడం విచారకరం. తక్షణం హాస్టల్ సీట్లు పెంచాల్సిన అవసరముంది. – ప్రవీణ్,
ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి, తిరుపతి
ఉద్యమం తప్పదు
టీటీడీ విద్యా సంస్థలలో డిగ్రీలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు పూర్తి స్థాయిలో హాస్టల్ వసతి కల్పించాలి. దూరాభారం నుంచి పేద విద్యార్థులు డిగ్రీ కోర్సులలో ప్రవేశాలు పొందుతున్నారు. కానీ ఇంటర్‌లో 95శాతం మార్కులు పొందిన విద్యార్థులకు కేవలం కాలేజ్‌లో సీటు ఇచ్చి హాస్టల్ వసతి కల్పించకపోవడం దారుణం. టీటీడీ అధికారులు పట్టించుకోకుంటే ఉద్యమం తప్పదు.
– రవి, ఎస్‌ఎఫ్‌ఐ, జిల్లా కార్యదర్శి
విద్యార్థుల జీవితాలతో ఆటలా..
పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో వందలాది మంది విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు హాస్టల్ సీట్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. అలాగే ఎస్వీ ఆర్ట్స్, ఎస్‌జీఎస్ డిగ్రీ కళాశాలలోనూ ఇదే పరిస్థితి. కళాశాలల్లో సీటు పొందిన ప్రతి విద్యార్థికీ హాస్టల్ వసతి కల్పించాలి. కానీ టీటీడీ అధికారులు విద్యార్థుల జీవితాలతో ఆటాడుకుంటున్నారు. తీరు మారకుంటే పోరుబాట పడతాం. – ప్రేమ్ కుమార్, వైఎస్సార్‌సీపీ ఎస్వీయూ
విద్యార్థి విభాగం అధ్యక్షుడు, తిరుపతి
దారుణంగా ఉంది
టీటీడీ విద్యా సంస్థలలో డిగ్రీ ప్రవేశాలు ఆలస్యంగా చేపట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నా రు. రెండు విడతలుగా అడ్మిషన్లు చేపట్టినా హాస్ట ల్ సీట్లు కేటాయించడంతో ఇటు కళాశాల అధికారు లు, అటు టీటీడీ అధికారులు పట్టించుకోకపోవడం సరికాదు. కళాశాలలో సీటు పొందిన ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలి. ప్రధానం పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో పేద విద్యార్థినుల పరిస్థితి దారుణంగా ఉంది. – శివశంకర్ నాయక్,
జీఎస్‌ఎన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తిరుపతి

టీటీడీ చొరవ చూపాలి

టీటీడీ చొరవ చూపాలి

టీటీడీ చొరవ చూపాలి