● రాష్ట్రంలో విచ్చలవిడిగా లిక్కర్‌ దందా ● ప్రభుత్వ తీరుపై వైఎస్సార్‌సీపీ మహిళల ఆగ్రహం ● ఎకై ్సజ్‌శాఖ కార్యాలయం వద్ద ధర్నా | - | Sakshi
Sakshi News home page

● రాష్ట్రంలో విచ్చలవిడిగా లిక్కర్‌ దందా ● ప్రభుత్వ తీరుపై వైఎస్సార్‌సీపీ మహిళల ఆగ్రహం ● ఎకై ్సజ్‌శాఖ కార్యాలయం వద్ద ధర్నా

Oct 9 2025 2:39 AM | Updated on Oct 9 2025 2:39 AM

● రాష్ట్రంలో విచ్చలవిడిగా లిక్కర్‌ దందా ● ప్రభుత్వ తీరు

● రాష్ట్రంలో విచ్చలవిడిగా లిక్కర్‌ దందా ● ప్రభుత్వ తీరు

● రాష్ట్రంలో విచ్చలవిడిగా లిక్కర్‌ దందా ● ప్రభుత్వ తీరుపై వైఎస్సార్‌సీపీ మహిళల ఆగ్రహం ● ఎకై ్సజ్‌శాఖ కార్యాలయం వద్ద ధర్నా

తిరుపతి మంగళం : రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు కాసుల కక్కుర్తితో కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీతాయాదవ్‌, తిరుపతి నగర బూత్‌కమిటీ ఇన్‌చార్జి ఉప్పాల సాయికుమారి మండిపడ్డారు. బుధవారం ఈ మేరకు తిరుపతిలోని ఎకై ్సజ్‌ శాఖ కార్యాలయం వద్ద మహిళలతో కలిసి ధర్నా నిర్వహించారు. మద్యం సీసాలను పగులగొట్టి నిరసన తెలిపారు. కల్తీ మద్యం అరికట్టాలి, బెల్ట్‌ షాపులను తొలగించాలి, నకిలీ లిక్కర్‌ తయారుచేస్తున్న టీడీపీ, జనసేన నేతలపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. టీడీపీ నేతలే విచ్చలవిడిగా కల్తీ మద్యం తయారు చేసి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబుకు దోచుకోవడం, దాచుకోవడం తప్ప నకిలీ లిక్కర్‌ కారణంగా మహిళల పుస్తెలు తెగిపోతున్నా పట్టదని ఆరోపించారు. ఈ ఏడాదిన్నరలోనే కల్తీ మద్యం తాగి వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా లిక్కర్‌ దందాను నిలిపివేయకుంటే ఇదే మద్యం ఒంటిపై పోసుకుని ఆత్మాహుతి చేసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో మద్యం విక్రయాలను అరికడతాం, మహిళల మానప్రాణాలకు అండగా ఉంటామని ఊదరగొట్టిన పవన్‌కల్యాణ్‌కు ఇప్పడు కల్తీ లిక్కర్‌ కనిపించం లేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ పుణీత, పార్టీ నేతలు నైనారు మధుబాల, విజయలక్ష్మీ రాయల్‌, పద్మజ, పుష్పలత, మహిత, రాజేశ్వరి, రాధ, పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement