
శ్రీహరి ఇలను చేరి!
కన్నుల పండువగా స్నపన తిరుమంజన సేవ
అలరించిన కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు
శ్రీవారిపై భక్తితో సారె సమర్పించిన
చంద్రగిరి భక్తులు
శుభ‘కరి’ శరణు కోరగా..
గజవాహనంపై విహరిస్తున్న కల్యాణ వేంకటేశ్వరస్వామి వారు
తిరుపతి రూరల్: తుమ్మలగుంట కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన సోమవారం ఉదయం హనుమంత వాహనంపైన, రాత్రి గజవాహనంపైన స్వామివారు పురవీధుల్లో ఊరేగారు. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు.
భక్తుల సారె సమర్పణ
చంద్రగిరి మండలం ఎ.రంగంపేట, కందులవారిపల్లి, చిన్నరామాపురం, రామిరెడ్డిపల్లి, కొటాల, ఐతేపల్లి, అగరాల, ఎం.కొంగరవారిపల్లి, కల్‌రోడ్డుపల్లి, పనబాకం పంచాయతీలకు చెందిన భక్తులు శ్రీవారిపై అపారమైన భక్తితో సారెను తీసుకువచ్చారు. సారె తెచ్చిన భక్తులకు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి సాదరంగా స్వాగతం పలికి ఆలయంలో దర్శన ఏర్పాట్లు చేయించారు. అలాగే గజవాహనానికి తిరుపతి రూరల్ మండలం సి.గొల్లపల్లి, మల్లంగుంట, సి.మల్లవరం, గాంధీపురం పంచాయతీలకు చెందిన భక్తులు స్వామివారికి సారె సమర్పించారు. వారికి మోహిత్‌రెడ్డి దగ్గరుండి అల్పాహారం వడ్డించి ప్రతి ఒక్కరికీ స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. హనుమంత, గజ వాహనాల్లో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. దేవతా మూర్తుల కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
హనుమంత, గజవాహనాలపై శ్రీహరి వైభవం

శ్రీహరి ఇలను చేరి!

శ్రీహరి ఇలను చేరి!

శ్రీహరి ఇలను చేరి!