
ఆటో విరాళం
తిరుపతి అర్బన్: రేణిగుంట మండలంలోని కరకంబాడీ పంచాయితీలోని చైతన్యపురానికి చెందిన పి.సతీష్‌కు కలెక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా ఆటోను విరాళంగా సోమవారం అందజేశారు. ఆటో డ్రైవర్ సతీష్ పక్షవాతంతో ఇటీవల ఆస్పత్రిపాలయ్యారు. ఈ క్రమంలో వైద్య ఖర్చుల నిమిత్తం పెద్ద మొత్తంలో అప్పులు తీసుకున్నారు. తిరిగి సాధారణ స్థితికి చేరుకున్న అనంతరం ఇటీవల ఆయన కలెక్టర్‌ను కలిశారు. తమకు సాయం చేయాలని కోరారు. దీంతో కలెక్టర్ సూచనల మేరకు డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు రాస్ సంస్థ వారి ఆర్థిక సౌజన్యంతో కొత్త ఆటోను సతీష్‌కు ఇప్పించారు. ఆ మేరకు కలెక్టర్ చేతుల మీదుగా ఆటోను అందజేశారు. రాస్ సంస్థ జనరల్ సెక్రటరీ వెంకటరత్నంను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు, పొదుపు సంఘాల సంచాలకులు వి. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.