
రిసోర్స్‌పర్సన్లకు ముగిసిన శిక్షణ
తిరుపతి రూరల్ : రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో 25 మంది బాహ్య కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లకు మూడు రోజుల పాటు తిరుపతిలోని యూత్ హాస్టల్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఎన్‌ఆర్‌ఓలు కృష్ణారావు, హుమయూన్, దాదాపీర్, రీజినల్ ట్రైనింగ్ కో–ఆర్డినేటర్ రవిచంద్ర ప్రసాద్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఎ.షణ్ముగం మాట్లాడుతూ సహజ వ్యవసాయ పద్ధతులు, కషాయాలు తయారీని సమగ్రంగా వివరించారు. మొదటి రోజు శిక్షణలో పాల్గొన్న వారికి రైతు సాధికార సంస్థ సూత్రాల వివరణ, మూల్యాంకన పరీక్షలు నిర్వహించారు. రెండో రోజు ఐసీటీ వినియోగం, ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రక్రియలు, ఆరోగ్య, పోషకాహార విభాగం నుంచి ప్రత్యేక శిక్షణ అందించారు. మూడో రోజు ఫీల్డ్ విజిట్‌లో భాగంగా నారావారిపల్లెలో పీఎండీఎస్, ఏటీఎం, సూర్యమండల మోడల్స్‌ను చూపించారు. అనంతరం రంగంపేటలో డ్రై ప్యాడీ ఇంటర్వెన్షన్లను పరిశీలించారు. తిరుపతి రూరల్ మండలం వేమూరులో ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో కషాయం తయారీ పద్ధతి, అలాగే సహజ వ్యవసాయ 9 సూత్రాలను ప్రాక్టికల్‌గా ప్రదర్శించారు.