
బధిరులకు అండగా ఉంటాం
తిరుపతి అర్బన్: బధిరులకు అండగా ఉంటామని డిజేబుల్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ వినోద్ తెలిపారు. కలెక్టరేట్‌లో ఆదివారం అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ బధిరులకు ఉన్నత చదువుల కోసం రూ.8.4 లక్షలతో 23 ల్యాప్‌టాప్‌లు, రూ.3.6 లక్షలతో 24 టచ్‌ఫోన్లు, రూ.36 వేల విలువ చేసే పది చెవిటి మిషన్ లు ఇదివరకు ప్రభుత్వం ద్వారా ఇప్పిచ్చామన్నారు. యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్ ద్వారా బధిరులకు వారి క్వాలిఫికేషన్ బట్టి ఉచితంగా శిక్షణా తరగతులు నిర్వహించి ప్రైవేటు ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి పి.గురుస్వామిశెట్టి, రిటైర్డ్ ప్రొఫెసర్లు డాక్టర్ ఎన్. రమణప్ప, ఆదినారాయణరెడ్డి, కృష్ణారెడ్డి, వెంకటశివారెడ్డి, సంఘ నాయకులు కళ్యాణ చక్రవర్తి, రెడ్డెప్ప పాల్గొన్నారు.