
ముగిసిన ఆర్ట్ వర్క్ షాప్
ఏర్పేడు: ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో ఆర్ట్ వర్క్ షాప్ ఆదివారం ముగిసింది. ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి పాల్గొని ఆర్ట్ చిత్రాల ఎగ్జిబిషన్ తిలకించారు. ఐఐటీ, ఐసర్ విద్యా సంస్థలకు చెందిన ఔత్సాహిక విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
టీటీడీకి 18 క్లీనింగ్
యంత్రాలు విరాళం
తిరుమల: కార్పొరేట్ సోషియల్ రెస్పాన్స్‌బిలిటీ (సీస్సార్)లో భాగంగా ఐడీబీ బ్యాంక్ టీటీడీ ఆరోగ్య విభాగానికి రూ.19 లక్షల విలువైన 18 క్లీనింగ్ మిషన్లను ఆదివారం విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ బ్యాంకు ఎండీ–సీఈఓ రాకేష్‌శర్మ శ్రీవారి ఆలయం ముందు పేష్కార్ రామకృష్ణకు యంత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆరోగ్యాధికారి మధుసూదన్, ఐడీబీఐ బ్యాంక్ రీజనల్ హెడ్ సాయికృష్ణ, తిరుపతి బ్రాంచ్ హెడ్ పల్లి రమేష్, బ్రాంచ్ మేనేజర్ దూడల రాజేష్ పాల్గొన్నారు.
గుర్తుతెలియని
యువకుడి మృతి
రేణిగుంట : మండలంలోని గుత్తివారిపల్లె సమీపంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని స్థానికులు ఆదివారం గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ నాగరాజు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి ఎత్తు సుమారు 5.8 అడుగులు ఉంటుందని, ఒంటిపై ముదురు నీలం రంగు ఫుల్ నెక్ బనియన్, బ్లూజీన్స్ ప్యాంట్ ఉందని వెల్లడించారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అధికంగా మద్యం తాగి డీహైడ్రేషన్ కారణంగా లేదా అనారోగ్యంతోనే మరణించి ఉండవచ్చని వివరించారు. వెదుళ్లచెరువు వీఆర్‌ఓ మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతిలోని ఎస్‌వీ మెడికల్ కళాశాలకు తరలించారు.

ముగిసిన ఆర్ట్ వర్క్ షాప్

ముగిసిన ఆర్ట్ వర్క్ షాప్