
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాలకులు చేసే తప్పులు, పొరపాట్లను ప్రజలకు చేరవేయడంలో పత్రికలది ప్రధానపాత్ర. ప్రజాస్వామ్య పరిరక్షణలో అవి కీలకపాత్ర పోషిస్తాయి. ప్రభుత్వ అవినీతిని, పాలకుల వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజలకు వాస్తవాలను చేరవేస్తోందనే అక్కసుతో సాక్షిదినపత్రికపై కక్ష సాధింపులకు పాల్పడడం సరైన విధానం కాదు. సాక్షి ఎడిటర్, రిపోర్టర్లపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి. కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడమే.
– సోమురెడ్డి, విశ్రాంత వీఆర్వో అసోసియేషన్ నాయకులు