
అవమానించారని..
తిరుపతి రూరల్: అసత్యపు ప్రచారం చేసి, అవమానిస్తున్నారన్న మనోవేదనతో ఓ మహిళ తన ఇద్దరు బిడ్డలతో సహా విషం తాగిన ఘటన ఆదివారం రాత్రి జగనన్న కాలనీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. తిరుపతి రూరల్ మండలం, దుర్గసముద్రం పంచాయతీ పరిధిలోని నివాసముంటున్న గాయత్రి, దిల్‌షాద్‌బేగంకు చిన్నపాటి తగాదాలు ఉన్నాయి. ఇటీవల దిల్‌షాద్‌బేగం జిల్లా ఎస్పీని కలసి అర్జీ ఇచ్చారు. దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. గాయత్రి దిల్‌షాద్‌బేగంపై తప్పుడు ప్రచారం చేయడంతో ఆమె తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. కుమారుడు సంతోష్ (10), కుమార్తె తేజ్‌కుమారి(11)కు విషం తాపించి ఆ తరువాత ఆమె కూడా తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కేసు దర్యాప్తులో ఉంది.

అవమానించారని..

అవమానించారని..