
కై వల్యానదిలో ఆక్రమణలు
సాక్షి టాస్క్‌ఫోర్స్ : వెంకటగిరి పట్టణంలో ప్రధానంగా ఉండే కై వల్యానదిలో సైతం ఆక్రమణలకు బరి తెగిస్తున్నారు. వెంకటగిరి సమీపంలోని కొండ కింద ప్రాంతాల నుంచి డక్కిలి, బాలాయపల్లి, సైదాపురం మండలాల మీదుగా కై వల్యానది ప్రవహిస్తోంది. నది సమీపంలో కొందరు యథేచ్ఛగా ఆక్రమణలు సాగిస్తున్నారు. వర్షాకాల సమయంలో కొండ కింద ప్రాంతాల నుంచి వర్షపు నీటి ప్రవాహం కై వల్యానదిలో ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. ఈ క్రమంలో కై వల్యానదిలో ఒడ్డున అక్రమ నిర్మాణాలు చేపడితే ప్రవాహానికి కొట్టుకుపోయో పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2015లో కై వల్యానది 30 అడుగులపైకి వరద నీరు ప్రవహించి సమీపం ఒడ్డున తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయాల్లోకి వరద నీరు సొచ్చుకొచ్చిన ఉదంతాలు ఉన్నాయి. అయితే బఫర్ జోన్‌లో నిర్మాణాలు చేపడుతుంటే అడ్డుకోవాల్సిన అధికారులు రికార్డులను తారుమారు చేసి నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూమూళ్లు ముట్టజెబుతుండడంతోనే అనుమతులకు అధికారులు పచ్చజెండా ఊపుతున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. వెంకటగిరిలో భూ ఆక్రమణలు రోజు రోజుకూ మితిమీరిపోతున్నాయని వాటిని నివారించాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి బఫర్ జోన్‌లో ఆక్రమణలను తొలగించాలని పలువురు కోరుతున్నారు.