
ట్యాంకుల శుభ్రతపై కదిలిన అధికారులు
వరదయ్యపాళెం : తాగునీటి ట్యాంకుల శుభ్రత, పైపులైన్ లీకేజీలు, పారిశుద్ధ్యం, మూలనపడ్డ నీటి పరీక్షలు గురించి ఈనెల 19న ప్రజల వేదన కథనం సాక్షి దినపత్రికలో ప్రచురితమైంది. దీనిపై జిల్లా యంత్రాంగం స్పందించింది. డీపీఓ, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ మండలాల వారీగా ఆయా శాఖల అధికారులతో సమీక్షించి తక్షణమే ట్యాంకుల శుభ్రత, పారిశుద్ధ్యంపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు వరదయ్యపాళెం మేజర్ పంచాయతీలో హైస్కూల్ గిరిజన కాలనీలో చర్మవ్యాధితో ఇబ్బందిపడుతున్న బాలుడు పోలయ్యకు స్థానిక వరదయ్యపాళెం సచివాలయం–1లో నిర్వహించిన వైద్య శిబిరంలో డాక్టర్ ద్వైత పరీక్షలు చేసి వైద్యం చేపట్టారు. అలాగే గోవర్థనపురంలో మురుగు కాలువలో ఉన్న తాగునీటి కొళాయిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. అలాగే మండలంలో ట్యాంకుల శుభ్రతపై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ నీలిమ, ఇన్‌ఛార్జ్ ఈఓపీఆర్డీ బసిరెడ్డి పంచాయతీ కార్యదర్శులతో సమీక్షించారు.

ట్యాంకుల శుభ్రతపై కదిలిన అధికారులు

ట్యాంకుల శుభ్రతపై కదిలిన అధికారులు