
విద్యాభివృద్ధికి సహకారం
శ్రీసిటీ (సత్యవేడు) : విద్యారంగ అభివృద్ధికి సహకరిస్తూ..సామాజిక బాధ్యతకు కట్టుబడి ఉన్నామని రాక్‌వర్త్ పరిశ్రమ సీఈఓ శైలేష్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆఫీస్ ఫర్నిచర్ తయారీ అగ్రగామీ సంస్థ రాక్‌వర్త్ సిస్టమ్ ఫర్నీచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గురువారం శ్రీ సిటీలోని తమ పరిశ్రమ 14వ వార్షికోత్సవాన్ని వేడుకగా జరుపుకుంది. ఈ వేడుకలో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శైలేష్ కుమార్, తన తల్లి జ్ఞాపకార్థం మీనాదేవి మెమోరియల్ ట్రస్టు పేరిట రాక్‌వర్త్ ఉద్యోగుల పిల్లలు 40 మందికి , పరిసరాలకు చెందిన ఇతర పిల్లలు మరో 25 మందికి కలిపి రూ. 30 లక్షలు విద్యార్థుల ఫీజులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఏడాదిలో ఈ సంఖ్యను 100కు పెంచాలన్నది తన సంకల్పంగా శైలేష్ కుమార్ సింగ్ ప్రకటించారు.