
జేశాప్ జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవం
తిరుపతి ఎడ్యుకేషన్ : రాష్ట్రంలోనే ఏకై క జర్నలిస్టు క్రీడా సంఘంగా గుర్తింపు పొందిన జేశాప్ (జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ) ఉమ్మడి తిరుపతి, చిత్తూరు జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. జేశాప్ రాష్ట్ర అధ్యక్షుడు రత్నాకర్, ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, తిరుపతి జిల్లా ఇన్‌చార్జ్ నరేష్ ఆదేశాల మేరకు శుక్రవారం తిరుపతి కరకంబాడి రోడ్డులోని సీవీ క్రికెట్ అకాడమీలో జిల్లాస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జేశాప్ గత జిల్లా కమిటీ అధ్యక్షుడు పులుగూరు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి ఎన్.శ్రీనివాసులు సమక్షంలో పలు తీర్మానాలు చేశారు. ఇందులో భాగంగానే నూతన జిల్లా కమిటీని వారు ప్రకటించారు. జేశాప్ తిరుపతి, చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా విజయ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా నారా హరిబాబు, కోశాధికారిగా భూమిరెడ్డి నరేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితోపాటు ఉపాధ్యక్షులుగా పి.సుబ్రహ్మణ్యం, దుగ్గాని ప్రసాద్, నెల్లూరు శ్రీనివాసులు, ఉప కార్యదర్శులుగా కామేశ్వరయ్య, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, ప్రసాద్, సీనయ్య ఎన్నిక కాగా ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నాగార్జున, ప్రతాప్ కుమార్, చిన్నబాబు, మునిశేఖర్, అమర్నాథ్, విజయ్ కుమార్, మునికృష్ణారెడ్డి, భాస్కర్, లోకేష్ రాజు, సతీష్ కుమార్, తులసి రామ్, జగదీష్, మనోహర్ ఏకగ్రీవంగా ఎన్నికయిన వారిలో ఉన్నారు.
జర్నలిస్టులకు క్రీడలు అవసరం
జర్నలిస్టులకు క్రీడలు ఎంతో అవసరమని, జర్నలిస్టులు రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో రాణించాలని రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రత్నాకర్, విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. అక్టోబర్ నెల 5, 6, 7, 8 తేదీల్లో అనంతపురం ఆర్‌డీటీ స్టేడియం వేదికగా పోటీలు జరగనున్నాయి.