
దూరప్రాంతాల నుంచి డీఈవో కార్యాలయానికి పరుగులు
దూరప్రాంతాల నుంచి డీఈవో కార్యాలయానికి పరుగులు
అవమానించి మోసం చేశారంటూ కూటమి ప్రభుత్వం పై విమర్శలు
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని తిరుపతి, శ్రీకాళహస్తి, మదనపల్లి, కుప్పం, చిత్తూరు, పుత్తూరు పలు ప్రాంతాల నుంచి మెగా డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులు డీఈవో కార్యాలయానికి విచ్చేశారు. ర్యాంకు, మార్కుల పరంగా అర్హత ఉన్న తమకు అన్యాయం జరిగిందంటూ అధికారులకు మొరపెట్టుకున్నారు. పీఈటీ, ఇతర కేటగిరిలతోపాటు స్పోర్ట్స్ కోటాలో ఎంపికై న వారి సర్టిఫికెట్లు సమగ్రంగా విచారించలేదని ఆరోపించారు. ఈడబ్ల్యూఎస్, పీహెచ్ కేటగిరీల్లో అనర్హులకు అందలం ఎక్కించారన్నారు.
తుది జాబితాలో 1,408 మంది ఎంపిక
రాష్ట్ర విద్యాశాఖ అధికారులు సోమవారం ప్రచురించిన మెగా డీఎస్సీ తుది జాబితాలో 1,408 మంది ఎంపికై నట్లు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కేడర్‌లలో 1,478 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేశారు. ఈ ప్రక్రియ తుది జాబితా ప్రచురణ నాటికి పలు కేడర్‌లలో 1,408 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని పేర్కొన్నారు. తుది ఎంపిక జాబితాలను కలెక్టరేట్, డీఈవో కార్యాలయ నోటీసు బోర్డులలో ప్రచురించారు. తుది జాబితాలో అభ్యర్థులకు ఎవరైనా అభ్యంతరాలున్నట్లైతే కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ 8498991250 నెంబర్‌లో తెలియజేయాలని డీఈవో వరలక్ష్మి తెలిపారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా డీఎస్సీ తుది ఎంపిక
మేనేజ్‌మెంట్ నోటిఫైడ్ ఎంపికై న అర్హత లేక
పోస్టులు పోస్టులు భర్తీ కాని పోస్టులు
ప్రభుత్వ, లోకల్‌బాడీస్ 1,312 1,254 58
మున్సిపాలిటీ 64 57 07
మున్సిపల్ కార్పొరేషన్ 97 92 05
ట్రైబల్‌ఆశ్రమ పాఠశాలలు 05 05 00
మొత్తం పోస్టులు 1,478 1, 408 70