
మహిళా వర్సిటీలో ‘క్వాంటమ్ వ్యాలీ’
తిరుపతి రూరల్ : పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఏఐసీటీఈ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ అకాడమిక్ ప్రోగ్రామ్ పరిధిలో క్వాంటమ్ వ్యాలీని సోమవారం ప్రారంభించారు. సాంకేతిక విద్యలో తాజా పరిణామాలు, సాధించాల్సిన అభివృద్ధిపై వారం రోజుల పాటు చర్చించనున్నారు. వీసీ ఉమ మాట్లాడుతూ ప్రభుత్వం అమరావతిని క్వాంటమ్ వ్యాలీతో పరిశోధన, ఆవిష్కరణలకు కేంద్రంగా అభివృద్ధి చేయబోతోందన్నారు. డాక్టర్ వై.భవాని కుమార్ మాట్లాడుతూ క్వాంటమ్ టెక్నాలజీస్‌లో ప్రోగ్రామింగ్ ప్రాక్టికల్ అంశాలను వివరించారు. రిజిస్ట్రార్ రజని, ప్రొఫెసర్ మల్లికార్జున, ప్రొఫెసర్ పి. వెంకట కృష్ణ, కో–ఆర్డినేటర్ వి.సరిత పాల్గొన్నారు.