
తిరుపతి: తిరుమల పుణ్యక్షేత్రంలో ఘోర అపచారం జరిగింది. తిరుమల కొండకు భక్తులు కాలినడకన వెళ్లే అలిపిరి పాదాల వద్ద శ్రీమహా విష్ష్ణువు విగ్రహాన్ని టీటీడీ నిర్లక్ష్యంగా పడేసింది. మలమూత్రాలు, మద్యం బాటిల్స్ సమీపంలో నిర్లక్ష్యంగా శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని పడేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు.
‘హైందవ ధర్మం పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విగ్రహం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. హిందూ దేవుళ్ల విగ్రహాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. అలిపిరి ఓల్డ్ చెక్ పాయింట్ కారు పార్కింగ్ వద్ద విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారు. తక్షణమే టిటిడి చైర్మన్, పాలకమండలి రాజీనామా చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించాలి. హిందుత్వ సంఘాలు , మఠాధిపతులు మేల్కొవాలి’ అని భూమన డిమాండ్ చేశారు.

