
స్వేచ్ఛను హరించడం తగదు
ప్రజాస్వామ్య దేశంలో పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం దారుణం. పాత్రికేయులకు స్వేచ్ఛ కల్పించాలి. నిజాలను నిర్భయంగా రాసే వారిపై కేసులు నమోదు చేయడం సబబు కాదు. నాయకులు మీడియా సమావేశాల్లో తెలియజేసిన విషయాలను కూడా పత్రికల్లో వస్తే నేరమనడం హాస్యాస్పదం. లోటు పాట్లను గురించి వాస్తవాలు రాస్తే పత్రికా యాజమాన్యం పై కేసులు నమోదు చేసి విచారణ పేరుతో వేధించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. సాక్షి పై కేసు నమోదు చేయడం అన్యాయం. పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదు. విమర్శలు చేస్తే కేసులు పెట్టడం, ప్రభుత్వ పరిపాలన లోపాలను ఎత్తిచూపితే మీడియా సంస్థలను నియంత్రించాలనుకోవడం అన్యాయం. సాక్షి ఎడిటర్, రిపోర్టర్‌లపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి. – ప్రకాష్, విద్యావేత్త