చిల్లకూరు: వెంకటగిరి డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు సోమవారం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లింది. వివరాలు.. సోమవారం మధ్యాహ్నం నెల్లూరు నుంచి ఆర్టీసీ బస్సు వెంకటగిరి బయలుదేరింది. బస్సు కొమ్మనేటూరు సమీపంలోకి వచ్చేసరికి డ్రైవర్ కునుకుతీశాడు. బస్సు అదుపు తప్పింది. డ్రైవర్ తేరుకునే సరికే బస్సు రోడ్డు పక్కనే ఉన్న బస్సు షెల్టర్‌ను, తరువాత ఓ దుకాణాన్ని ఢీకొని ముళ్లపొదల్లోకి దూసుకెళ్లి నిలిచిపోయింది.ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. బస్సు మరో రెండు మీటర్లు వెళ్లి ఉంటే హై టెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని పెద్ద ప్రమాదం సంభవించి ఉండేదని స్థానికులు తెలిపారు. పోలీసులు దర్యాపు ్తచేస్తున్నారు.