
ముక్కంటి సేవలో ప్రిన్సిపల్ సెక్రటరీ
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరస్వామివారిని దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజవహర్‌లాల్ సేవించుకున్నారు. సోమవారం ఆయనకు దక్షిణ గోపురం వద్ద ఈఓ బాపిరెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద వేదపండితులు ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాదాల పోటును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. భక్తులతో మాట్లాడి ఆలయంలో వసతులపై ఆరా తీశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ కృష్ణారెడ్డి, ఏఈఓ మోహన్, విద్యాసాగర్, పర్యవేక్షకులు నాగభూషణం, సుదర్శన్, ఏపీఆర్‌ఓ రవి పాల్గొన్నారు.
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల : తిరుమల శ్రీవారిని సోమవారం పలువురు ప్రముఖులు సేవించుకున్నారు. వీరిలో ఎంపీలు రవిచంద్ర, డీకే అరుణ, రాఘవేంద్ర, లక్ష్మీకాంత్ వాజపేయి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎమ్మెల్యే రివాబా జడేజా ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. టీటీడీ అధికారులు ఘనంగా లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.
మారిషన్ ప్రధానికి సాదర స్వాగతం.. వీడ్కోలు
రేణిగుంట : తిరుపతి– తిరుమల పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి మారిషన్ ప్రధాని నవీన్‌చంద్ర రాంగూళం చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజవహర్‌లాల్, అనంతపురం డీఐఈ షిమోసి బాజ్‌పేయి, జేసీ శుభం బన్సల్ సాదర స్వాగతం పలికారు. పర్యటన ముగించుకుని రేణిగుంట ఎయిర్‌పోర్టు చేరుకున్న మారిషస్ ప్రధానికి మంత్రితోపాటు అధికారులు వీడ్కోలు పలికారు.

ముక్కంటి సేవలో ప్రిన్సిపల్ సెక్రటరీ