
ప్రశాంతంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు
తిరుపతి అర్బన్ : ప్రశాంతంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను ఆదివారం తిరుపతిలోని ఆరు కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో నిర్వహించామని జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు తెలిపారు. ఆదివారం తిరుపతిలోని పలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్, బీట్, సెక్షన్ ఆఫీసర్లకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు చేపట్టామని వెల్లడించారు. ఉదయం పరీక్షల్లో 10,493 మంది అభ్యర్థులకు 8,670 మంది మాత్రమే హాజరయ్యారని పేర్కొన్నారు. 1823 మంది హాజరు కాలేదని స్పష్టం చేశారు. అలాగే మధ్యాహ్నం పరీక్షల్లో 1690 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 1335 మంది మాత్రమే వచ్చారని చెప్పారు. 358 మంది హాజరు కాలేదని వివరించారు.
చంటి బిడ్డలతో హాజరైన మహిళలు
తిరుపతి అర్బన్ : తిరుపతి నగరంలో ఆదివారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను నిర్వహించారు. ఈ క్రమంలో తిరుపతి ఎస్వీ జూనియర్ కళాశాలలో పరీక్షలను రాయడానికి పలువురు మహిళా అభ్యర్థులు తమ చంటి బిడ్డలతో పరీక్షలకు హాజరయ్యారు.

ప్రశాంతంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు

ప్రశాంతంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు