
పకడ్బందీగా ‘మిషన్ శక్తి’
తిరుపతి అర్బన్ : ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మిషన్ శక్తి పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో మిషన్ శక్తి పథకంపై ఒక్కరోజు శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్నిశాఖల సమన్వయంతో పటిష్టంగా మిషన్ శక్తిని అమలు చేయాలని కోరారు. సమాజంలో ఆడబిడ్డలపై సాగుతున్న అఘాయిత్యాలు, అన్యాయాలపై అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. మహిళలు, బాలికల సాధికారతే లక్ష్యంగా సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా 12వ తేదీ వరకు మిషన్ శక్తి చేపట్టాలని స్పష్టం చేశారు. డీఎంహెచ్‌ఓ బాలకృష్ణ నాయక్, జిల్లా మిషన్ కో–ఆర్డినేటర్ కృష్ణ మంజరి, నోడల్ ఆఫీసర్ వాసంతి పాల్గొన్నారు.