
అగ్నిప్రమాదంపై అనుమానాలెన్నో
తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుపతి రైల్వేస్టేషన్ లో సోమవారం మధ్యాహ్నం లూప్‌లైన్‌లో ఆగి ఉన్న ఇసాక్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగిలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద సంఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల నగరంలో ఆకతాయిల తాకిడి అధికమైంది. వారికి హోటల్ భీమాస్ వెనుక ప్రాంతంలోని రైల్వేట్రాక్ (లూప్‌లైన్) పరిసరాలు అడ్డాగా మారాయి. కూతవేటు దూరంలో మద్యం దుకాణాలు, బార్లు ఉండడంతో ఆకతాయిలకు మరింత అనుకూల వాతావరణంగా మారింది. దీంతో అసాంఘిక కార్యకలాపాలకు ఈ ప్రాంతం అడ్డాగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా ఉదయం వేళల్లో సుదూర ప్రాంతాల నుంచి తిరుపతికి చేరుకునే కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు తిరుగు ప్రయాణం రాత్రి కావడంతో విశ్రాంతి తీసుకునే క్రమంలో లూప్‌లైన్ ట్రాక్‌లోకి తరలిస్తున్నారు. వాటిలో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌తోపాటు వారాంతపు రైళ్లను నిలుపుతున్నారు. ఇలా ఆగి ఉన్న రైలు బోగిలను ఆకతాయిలు తమ అడ్డాగా మార్చుకున్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం గంజాయి, మద్యం మత్తులోని ఆకతాయిలు బీడీ, సిగరెట్టు వంటివి కాల్చి ఆగి ఉన్న ఇసాక్ ఎక్స్‌ప్రెస్ రైలు జనరల్ బోగిలో వేసి ఉంటారనే అనుమానాలకు తావిస్తొంది. ఈ విషయం అగ్ని ప్రమాద సంఘటనా ప్రాంతానికి చేరుకున్న స్థానికులతో పాటు పోలీసు వర్గాల్లో సైతం చర్చకు దారి తీసింది.
ఆకతాయిలకు అడ్డగా లూప్‌లైన్ పరిసరాలు
వారిపైనే అనుమానాలు
విచారణలో వెలుగుచూసేనా..?
భిన్నంగా స్పందనలు
కాగా రైలు బోగిలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదపై రైల్వేస్టేషన్ మేనేజర్ చిన్నపరెడ్డి, జిల్లా అగ్నిమాపకాధికారి రమణయ్య స్పందించిన తీరు భిన్నంగా ఉంది. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితి, నష్టం వంటి వాటిపై విచారణ కమిటీ నివేదిక ఇస్తుందని స్టేషన్ మేనేజర్ చెప్పడం, మరోవైపు తిరుపతిలోని అధిక ఉష్ణోగ్రత కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందని అగ్నిమాఽపకాధికారి వెల్లడించడం వంటి అంశాలు ఆసక్తికరంగా మారాయి. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు వారు చెబుతున్న సమాధానాలకు పొంతన లేదు.
ఆకాయిల కట్టడి సాధ్యమేనా..?
ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వైన్‌షాపుల నుంచి బ్రాందీ, విస్కీ, బీరు తెచ్చుకుని దర్జాగా సేవిస్తున్నారంటూ సమీపం నివాస గృహాల ప్రజలు బాహటంగా చెబుతున్నారు. ముఖ్యంగా మద్యం, గంజాయి మత్తులో వీరంగం చేస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎలాంటి మార్పులు లేవనే తెలుస్తోంది. కూత వేటు దూరంలో రైల్వేస్టేషన్‌లోని ఆర్పీఎఫ్, జీఆర్పీపీ విభాగాలు, మరోవైపు వెలుపలి ప్రాంతంలో ఈస్ట్ పోలీసుస్టేషన్ ఉన్నాయి. అయినప్పటికీ ఆకతాయిల్లో భయమనేది లేదని తెలుస్తోంది. పర్యవేక్షణ కొరవడడంతో రైల్వేట్రాక్‌లపై ఆకతాయిల ఆగడాలు మితీమీరుతున్నాయనే విమర్శలున్నాయి. కాగా సోమవారం మధ్యాహ్నం రైలు బోగిలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో చెప్పుకోదగిన సంఖ్యలో పోలీసుల మొహరింపు కనిపించింది. ఏదేని భారీ సంఘటన జరిగితే తప్ప మిగిలిన సమయాల్లో పర్యవేక్షణ అంతంత మాత్రమేనా? అనే సందేహాలకు తావిస్తోంది.

అగ్నిప్రమాదంపై అనుమానాలెన్నో

అగ్నిప్రమాదంపై అనుమానాలెన్నో