
ఒకే ఆటోలో 25 మంది విద్యార్థుల ప్రయాణం
– పాఠశాల విలీన ఫలితం
బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలో ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం రద్దు చేయడంతో మరో పాఠశాలకు వెళ్లటానికి విద్యార్థులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. దీంతో కొంతమంది ఆటోవాలాలు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించటానికి వెనుకాడడం లేదు. మండలంలోని మొక్కలచేను గిరిజన కాలనీ లోని ప్రాథమిక పాఠశాలను రద్దు చేసి కల్లివెట్టులోని ప్రైమరీ పాఠశాలలో విలీనం చేశారు. మొక్కలచేను గిరిజన కాలనీలో 25 మంది పిల్లలు చదువుకుంటు న్నారు. మొక్కలచేను గిరిజన కాలనీ నుంచి కల్లివెట్టు పాఠశాలకు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. కల్లివెట్టు పాఠశాలకు వెళ్లటానికి 25 మంది విద్యార్థులు ఒకే ఆటోలో వెళుతున్నారు. పాఠశాల విలీన ఫలితంగానే విద్యార్థుల ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు.