
గంగ కాలువలో మృతదేహం గుర్తింపు
సత్యవేడు : కొత్తమారి కుప్పం సమీపంలోని గంగ కాలువలో కొట్టుకొచ్చిన మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్‌ఐ రామస్వామి తెలిపారు. మంగళవారం ఉదయం కొత్తమారి కుప్పం పంచాయతీ ఇంద్రపురం సమీపంలోని గంగ కాలువలో మృతదేహం తేలుతున్నట్లు సమాచారం రావడంతో ఎస్‌ఐ సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని కాలువ గట్టుకు చేర్చారు. మృతుడి భార్య, కుమారుడు వచ్చి తొట్టంబేడు మండలం, చిన్న సింగమాలకు చెందిన మునస్వామి(58)గా గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
గురుకులంలో మిగులు సీట్లకు కౌన్సెలింగ్ రేపు
తిరుపతి సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో మిగిలి ఉన్న సీట్లకు గురువారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ జిల్లా సమన్వయకర్త టి పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న ఆసక్తి గల విద్యార్థులు గురువారం ఉదయం 10 గంటలకు చిత్తూరులోని ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీ (పుత్తూరు రోడ్డులోని ఎంప్లాయీమెంట్ ఆఫీసు దగ్గర) కార్యాలయంలో జరగనున్న కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు.
ఆటో బోల్తా : ఒకరి మృతి
రాపూరు : రాపూరు–పెంచలకోన జాతీయ రహదారిలో మంగళవారం ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన రాపూరు మండలం పెనుబర్తి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా.. గోనుపల్లి నుంచి రాపూరునకు ఆటోలో ఏడుగురితో వస్తుండగా ఆటో పెనుబర్తి సమీపంలోకి రావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న గోనుపల్లి గ్రామానికి చెందిన పసుపులేటి మస్తాన్(47) అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన వారికి స్వల్ప గాయాలులైనట్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గంగ కాలువలో మృతదేహం గుర్తింపు