
కూటమి మోసాలను నిలదీద్దాం
శ్రీకాళహస్తి : చంద్రబాబు, పవన్ ప్రమాణం చేసిన మోసపూరిత వాగ్దానాలను అందరం సమష్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లి వారి మోసాలను ఎండగట్టాలని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని మధు కన్వెన్షన్ హాల్‌లో శ్రీబాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీశ్రీ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన నియోజవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భూమన కరుణాకరరెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల ముందు టీడీపీ నేతలు ప్రతి ఇంటికి వెళ్లి హామీలతో ప్రమాణ పత్రాలను ఇచ్చి ప్రజలను వంచించారన్నారు. గెలిచి ఏడాదవుతున్నా 90 వేల కోట్లకుపైగా అప్పులు చేశారనీ, ప్రజలకు ఇస్తానన్న హామీలు మాత్రం నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. కనీసం తల్లికి వందనం 80 లక్షల మందికి ఇవ్వాల్సి ఉండగా 50 లక్షల మందికి ఇచ్చి 30 లక్షల మందికి ద్రోహం చేశారన్నారు. ప్రతి ఆడబిడ్డకు రూ.1,500 ఇస్తానని బాండు ఇచ్చి నేడు వారిని వంచించారన్నారు. కూటమి మోసాలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు కలిసికట్టుగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు చేస్తున్న మోసాలను వివరించాలన్నారు. ప్రతి ఒక్కరూ క్యూర్ కోడ్‌ను స్కాన్ చేస్తే వారు ఇచ్చిన మామీలు, చేస్తున్న మోసాలకు సంబంధించి వీడియోలు ఉన్నాయని, వారు ఇచ్చిన సూపర్‌సిక్స్ 143 హామీలు ఏమయ్యాయో ప్రజలు వారిని నిలదీయాలన్నారు. శ్రీకాళహస్తిలో దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయని ఎంతో మంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని ప్లెక్సీలో కూడా చూడడానికి ఇక్కడి నాయకుకు భయమేస్తోందంటే ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతోందన్నారు. ఫ్లెక్సీలను తొలగించడం సరైన సంప్రదాయంకాదన్నారు.
మోసాలను ఇంటింటికీ తీసుకెళ్దాం
ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. కూటమి మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఇచ్చిన హామీలను నిలబట్టుకోకుండా ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. వారు చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గతంలో జగన్ సంక్షేమ పాలనను ప్రజలకు తెలియజేయాలన్నారు.
కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వరాలయ పాలక మండలి మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, గిరిధర్‌రెడ్డి, వయ్యాల కృష్ణారెడ్డి, ఉన్నం వాసుదేవనాయుడు, కోగిలి సుబ్రహ్మణ్యం, మధుసూదన్‌రెడ్డి, రమణయ్యయాదవ్, సుధాకర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, చంద్రయ్యనాయుడు, హరిప్రసాద్‌రెడ్డి, సిరాజ్‌బాషా, పఠాన్ ఫరీద్, శ్రీవారిసురేష్, కంఠా ఉదయ్ పాల్గొన్నారు.
ఆడబిడ్డకు అన్యాయం జరిగింది.. ఎక్కడ పవన్?
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సైనికునిల్లా పనిచేయాలి
బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ క్యూఆర్‌కోడ్ ఆవిష్కరణ
ఉమ్మడి చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన
శ్రీకాళహస్తిలో అరాచక పాలన
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అరాచక పాలన నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపేడులో 40 మంది ఎస్టీలు, తొట్టంబేడు మండలం కొత్తకండ్రిగ గ్రామంలో 20 ఇళ్లు ఊర్లు వదలి వలసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అరాచక పాలన తాము చేయలేదన్నారు. వెయ్యికి పైగా ఇల్లు పునాదులు ధ్వంసం చేశారని, గతంలో శ్రీకాళహస్తిలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ప్రస్తుత ఎమ్మెల్యే అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు.
‘మా ఆడబిడ్డ వినుతపై దాడి చేస్తారా నా కొ.. ల్లారా’ అని ఆ నాడు గొంతెత్తిన పవన్ కల్యాణ్ నేడు జన సైనికుడిని చంపిన కేసులో ఆమె ముద్దాయిగా జైలులో ఉంది.. దారుణంగా హత్యకు గురై రాయుడు చెల్లి శ్ఙ్రీఎక్కడున్నావ్ పవన్... ఇదంతా నీకు కనపడలేదా.. రాయుడు కుటుంబాన్ని ఎందుకు ఆదుకోలేదు’ అని ప్రశ్నిస్తుంటే ఎందుకు స్పంచదలేదని భూమన నిలదీశారు. తిరుపతిలో మీ నాయకుడు ఓ మహిళను ఇబ్బందులకు గురిచేస్తే దానిపై మాట్లాడవు.. మీ పార్టీకి చెందిన ఓ డ్యాన్సర్ ఓ మైనర్‌కు అన్యాయం చేస్తే మాట్లాడలేదేమని ప్రశ్నించారు. తిరుపతికి వచ్చి నేను సనాతవాదిని అని గద్దించి ఇంటికి వెళ్లి పడుకున్నావా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు కష్టం వస్తే ఎగసేకుని వచ్చి మాట్లాడుతావు గానీ.. నీ కార్యకర్తలకు కష్టం వస్తే మాట్లాడకపోవడం బాధాకరమన్నారు.

కూటమి మోసాలను నిలదీద్దాం