
మౌలిక వసతుల కల్పనకు నిధులు లేక
శనివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2025
పారిశ్రామిక వాడలు అభివృద్ధి చేసి యువతకు ఉపాధి కల్పించాలనే ఆశయం ఆదిలోనే నీరుగారిపోతోంది. కూటమి ప్రభుత్వం కేవలం ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించడం మినహా ఇప్పటి వరకు స్థల సేకరణలోనే కాలం వెల్లదీస్తున్నారు. ఎంపిక చేసిన ఆరుచోట్ల పారిశ్రామిక పార్కుల ప్రగతి ముందుకు సాగడం లేదు. క్షేత్రస్థాయిలో పలు సమస్యలు వెంటాడుతున్నాయి. కేటాయించిన స్థలాలు అభివృద్ధి చేయకుండానే పరిశ్రమలు వస్తాయని ఊరించడం యువతను మభ్యపెట్టేందుకేనని ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
చిల్లకూరు : యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లాలో ఆరుచోట్ల ఎంఎస్‌ఎంఈ(మైక్రో స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజస్) కింద పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు స్థలాలను (పార్కులు) ఇస్తామని ఆర్భాటంగా కూటమి ప్రభుత్వం ప్రకటనలు చేయడమే కానీ వాటికి పూర్తి స్థాయి మార్గ దర్శకాలు లేకుండా చేయడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తమ మార్కు రాజకీయంతో యువతను తమ వైపు తిప్పుకునేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సాహకాలు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించారు. అందుకు సంబంధించి పార్కులు ఏర్పాటు చేసి అక్కడ చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు చేసుకొని తమతో పాటుగా మరికొంత మందికి ఉపాధి కల్పించవచ్చని ఊరించడం, అటు తరువాత మిన్న కుండి పోవడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే తిరుపతి జిల్లాలో ఆరు నియోజకవర్గాలలో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేసేందుకు సిద్దం అయ్యారు. దీంతో ఆయా ప్రాంతాలలోని రెవెన్యూ అధికారులను ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని ఏపీ ఐఐసీకి అప్పగించేలా ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పారిశ్రామికంగా జిల్లా ముందడుగు వేయడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని ప్రకటనలు గుప్పించేస్తున్నారు.
క్షేత్ర స్థాయిలో మరోలా ...
ఏపీఐసీసీ భూ సేకరణ చేపట్టినప్పటికీ ఇక్కడ రెండు (తిరుపతి, నెల్లూరు) జిల్లాలకు చెందిన అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. దీంతో మూడు నియోజకవర్గాలకు ఒక అధికారి, మరో మూడు నియోజకవర్గాలు మరో అధికారి పర్యవేక్షణలో ఉండడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉన్న సమయంలో చిల్లకూరు మండలం నక్కల కాలువ కండ్రిగలో సుమారు 85 ఎకరాల భూములను ఏపీ ఐఐసీ స్వాధీనం చేసుకుంది. అయితే ఇక్కడ భూముల్లో ఏటా వర్షాలు కురిసిన సమయంలో నెలబల్లిరెట్టపల్లికి చెందిన దళితులు ఆ భూముల్లో వరి సాగు చేసుకుంటూ ఈ భూములను ఎన్నో ఏళ్లుగా తమ అధీనంలో ఉండగా పరిశ్రమలకు ఎలా కేటాయిస్తారని అడ్డుపడుతున్నారు. దీంతో అక్కడ భూములపై వివాదం నెలకొని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ప్రస్తుతం తిరుపతి జిల్లాలో కేటాయించిన భూముల్లో కూడా బాలాయపల్లి మండలంలోని మన్నూరులో ఎక్కడా ప్రభుత్వ భూముల లేక అటవీ భూములను పరిశీలించి అధికారులు నివేదికలను పంపారు. అటవీ భూములను పరిశ్రమలకు ఎలా కేటాయిస్తారని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు.
భూ కేటాంపులు ఇలా ..
జిల్లాలోని ఆరు నియోజకవర్గాలలోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రాచగున్నేరిలో 14 ఎకరాలు, వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లి మండలం మన్నూరులో 60 ఎకరాలు, గూడూరు నియోజకవర్గం గూడూరు మండలం కొమ్మనేటూరులో 40 ఎకరాలు, సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం శిరసనంబేడు వద్ద 100 ఎకరాలు, చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరిలో 65.29 ఎకరాల భూములను కేటాయించారు.
గూడూరు : కొమ్మనేటూరు ప్రాంతంలో ఎంఎస్‌ఎంఈ కోసం సేకరించిన భూమిలో పెరిగిన చెట్లు, పుట్టలు
వెంకటగిరి: మన్నూరులో ప్రభుత్వ భూములు లేకపోవడంతో అటవీ భూములను పరిశీలిస్తున్న తహసీల్దార్
ఆడబిడ్డకు అన్యాయంపై ఏకమయ్యారు!
00000
– 8లో
– 8లో
– 8లో
జిల్లాలో ఎంఎస్‌ఎంఈ పార్కులకు స్థలాలు కేటాయించిన ప్రాంతాలు
నియోజకవర్గం మండలం ప్రాంతం
గూడూరు గూడూరు కొమ్మనేటూరు
వెంకటగిరి బాలాయపల్లి మన్నూరు
సూళ్లూరుపేట పెళ్ళకూరు, శిరసనంబేడు
సత్యవేడు వరదయ్యపాళెం చినపాండూరు
శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి రాచగున్నేరి
చంద్రగిరి చంద్రగిరి చంద్రగిరి
న్యూస్‌రీల్
స్థల సేకరణే తప్ప నిధుల కేటాయింపు శూన్యం
కొన్నిచోట్ల ఆక్రమణలలో ప్రభుత్వ స్థలాలు
పరిశ్రమలకు చెందిన పార్కులు వస్తున్నాయని ప్రకటనలు
మౌలిక వసతులు కల్పించకుండానే అధికారుల హడావుడి
ఎంఎస్‌ఎంఈ (మైక్రోస్మాల్ మీడియం ఎంటర్ ప్రైజస్) కింద భూములను యువ పారిశ్రామిక వేత్తలకు అందించేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. అయితే ఇక్కడ భూ సేకరణను రెవెన్యూ అధికారులకు అప్పగించి వారి నుంచి ఏపీ ఐఐసీ స్వాధీనం చేసుకునేలా ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆగమేఘాల మీద రెవెన్యూ అధికారులు భూ సేకరణ చేపట్టారు. అయితే పలు చోట్ల భూములను అప్పగించినప్పటికీ ఒక్క మన్నూరు గ్రామంలో మాత్రం ప్రభుత్వ భూమి లేక అటవీ భూమిని గుర్తించి జిల్లా అధికారులకు స్థానిక తహసీల్దార్ విజయలక్ష్మి నివేదికలను పంపారు. మిగిలిన ఐదు చోట్లలో ఒక్క శ్రీకాళహస్తిలో మాత్రం నిధుల కేటాయింపు జరిగి మౌలిక వసతులు చేపడుతున్నారు. మిగిలిన నాలుగు ప్రాంతాలలో భూ కేటాయింపులను చేపట్టినప్పటికీ ఆయా ప్రాంతాలలో ఎక్కువగా చెట్లు, పుట్టలు పెరిగిపోయి ఉన్నాయి. వీటిని చదును చేసి అక్కడ రోడ్లు, నీటి వసతి కల్పిస్తే పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తారు. కానీ అక్కడ కనీస మౌలిక వసతులకు కూటమి ప్రభుత్వం నిధులు కేటాయింపు చేయకనే పారిశ్రామిక వాడలకు భూములు కేటాయించామని గొప్పలు చెప్పుకుంటూ ముందుకు వెళుతున్నారు.
శ్రీకాళహస్తిలో పనులు మొదలు పెట్టాం
ఎంఎస్‌ఎంఈ పార్కులకు సంబంధించి భూ సేకరణ పూర్తి కావస్తోంది. ప్రస్తుతం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రాచగున్నేరి ప్రాంతంలో ఎంఎస్‌ఎంఈ పార్కు కోసం మౌలిక వసతుల పనులను వేగంగా చేసేలా చర్యలు చేపడుతున్నాం. పనులు పూర్తి చేసిన తరువాత పారిశ్రామిక వేత్తల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి స్థలాలు కేటాయించడం జరుగుతుంది. జిల్లాలోని వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాలకు చెందిన పార్కులను నెల్లూరు జోనల్ మేనేజర్ పర్యవేక్షిస్తారు.
– విజయభరత్‌రెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, తిరుపతి

మౌలిక వసతుల కల్పనకు నిధులు లేక

మౌలిక వసతుల కల్పనకు నిధులు లేక

మౌలిక వసతుల కల్పనకు నిధులు లేక