
ఎందుకంత భయం?
సాక్షి టాస్క్‌ఫోర్స్ : శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి ఈసారి వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలపై తన ప్రతాపం చూపించారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లకు అనుమతి లేవంటూ మున్సిపల్ అధికారుల చేత తొలగించారు. అవే ఫ్లెక్సీల పక్కనే ఉన్న కూటమి నేతల కటౌట్‌లు, ఫ్లెక్సీల జోలికి మాత్రం వెళ్లలేదు. కూటమి ఏడాది పాలనా వైఫల్యాలపై వైఎస్సార్‌సీపీ చేపట్టిన బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమం శుక్రవారం శ్రీకాళహస్తిలో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలో వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తిలో కూటమి పార్టీపై జనంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న తరుణంలో వైఎస్సార్‌సీపీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే భయపెట్టే ప్రయత్నం చేశారు. మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెచ్చి పట్టణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలను తొలగించారు. అయితే పక్కనే కూటమి ఫ్లెక్సీలు ఉన్నా వాటి జోలికి వెళ్లకుండా వైఎస్సార్‌సీపీకి చెందిన వాటినే తొలగించడంపై స్థానికులు మండిపడుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలను తొలగించటాన్ని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యే తొత్తులుగా వ్యవహరించొద్దని హెచ్చరించారు.
శ్రీకాళహస్తిలో కూటమి కుట్రలు
వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలను తొలగించిన వైనం
మున్సిపల్ అధికారులను ఉసిగొల్పిన ఎమ్మెల్యే
కూటమి ఫ్లెక్సీలు, కటౌట్‌లను ముట్టుకోని అధికారులు

ఎందుకంత భయం?